అన్వేషించండి

Bandi Sanjay On Agnipath: తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణించాయన్నారు బండి సంజయ్. టిఆర్ఎస్, ఎంఐఎం నేతలే విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని తెలంగాణ బీజేపీ ఆరోపించింది. బాసరలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన ఆయన్ని మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌... సికింద్రబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. 

తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణించాయన్నారు బండి సంజయ్. టిఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారు. హైదరాబాదులో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయస్థాయి సమావేశాలపై దృష్టి మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు సంజయ్. రైల్వే ఆస్తుల విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు బండి.

సికింద్రాబాద్‌లో ఆర్మీస్టూడెంట్స్ పేరు మీద కొందరు వ్యక్తులు వచ్చి రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం... ప్రయాణికులపై దాడులు చేయడం దారుణమన్నారు బండి సంజయ్. దీనికి ఆర్మీ విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం వాళ్లదేనన్నారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్‌ విభాగం ఏం చేస్తోందని నిలదీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వం ప్రేరేపించి చేసిన విధ్వంసమేనన్నారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం  స్పందించలేదంటే... ఎవరి ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. కచ్చితంగా బుల్డోజర్ ప్రభుత్వం వస్తేనే ఇలాంటి వారి ఆటలకు అడ్డుకట్టపడుతుందన్నారు.
 
యువతకు అన్యాయం చేసే పని మోదీ ప్రభుత్వ చేయదన్నారు బండి సంజయ్. కచ్చితంగా వాళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని దేశ సేవ కోసం అగ్నిపథ్ తీసుకొచ్చారన్నారు. కావాలనే కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని... వాళ్ల ట్రాప్‌లో పడొద్దని యువతకు సూచించారు. 

త్రిపుట్ ఐటీకి వెళ్తున్న బండి సంజయ్‌ను సుమారు అరగంటపాటు కార్‌లోనే ఉంచి పోలీసులు త్రిబుల్ ఐటీ కి వెళ్లొద్దు అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా త్రిపుల్ ఐటీకి వెళ్తానని బండి సంజయ్ తెలపడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను సిల్లి అని తీసేసిన సీఎం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని విమర్శించారు. 

రాష్ట్రంలో ఒక్క ట్రిపుల్ ఐటీని మెయింటెన్ చేయని సీఎం మిగతా విద్యాసంస్థలను ఏం మెయింటెన్ చేస్తారని అన్నారు సంజయ్. ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా.. టెర్రరిస్టులా.. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. విద్యార్థులకు భరోసా కల్పించేందుకే తాము వెళ్తే అడ్డుకున్నారన్నారు. బీజేపీని ఆపడం సీఎం తాత తరం కూడా కాదని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Embed widget