అన్వేషించండి

Telangana Assembly News: రైతు పంటకు రూ.1900, కేసీఆర్ ఫాంహౌజ్ వరికి రూ.4200! విచారణకు సిద్ధమా? సీఎం రేవంత్ సవాల్

Telangana Assembly Sessions: వరి వేస్తే ఉరి అని సీఎం హోదాలోనే కేసీఆర్ గతంలో అన్నారు. కానీ ఫామ్ హౌజ్లో 150 ఎకరాల్లో వరి పండించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Telangana CM Revanth Reddy: హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటు అయిన 2014 వరకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఎన్ని కేసులున్నాయి, విద్యార్థుల మీద ఉన్న ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఉద్యమ కేసులు తొలగించినవి ఎన్ని. దీనిపై ఏనాడైనా సమీక్ష చేశారా?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, గత ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ధర్నా చౌక్ ఎత్తేసి నిర్బంధం సాగించారు, కేటీఆర్ ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
తన ప్రసంగంలో రేవంత్ ప్రస్తావించిన మరిన్ని అంశాలివే..

రైతు పంటకు క్వింటాలకు రూ.1900, కేసీఆర్ ఫాంహౌజ్ లో పండితే రూ.4200..
వరి వేస్తే ఉరి అని సీఎం హోదాలోనే కేసీఆర్ గతంలో అన్నారు. కానీ తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి పండించారు కేసీఆర్. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర రూ.1900  ఇచ్చారు. అదే ఫాంహౌజ్ లో పండించిన వరికి క్వింటాలుకు రూ.4200 ఇచ్చారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో పండింది ఏమైనా బంగారమా అని సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫాం హౌజ్ లో పండిన వరిని రూ.4200కు అమ్మలేదు అంటే.. విచారణకు సిద్దమా? చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో 10వ స్థానంలో ఉంటే, గత పాలకులు ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పి బతికేశారని వ్యాఖ్యానించారు.

రైతులకు బేడీలు వేసినందుకు సిగ్గుపడాలి..
తెలంగాణలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారని బీఆర్ఎస్ సభ్యులు గుర్తించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో.. పేదలకు విద్య, వైద్యం అందిస్తాం.  అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తాం, ప్రతి ఒక్కరికి హక్కులు ఇస్తామన్నారు. నేరెళ్ళల్లో ఇసుక దోపిడీలో మీ పాత్రలేదా, కేటీఆర్ నిజంగా సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
దళితులపై అక్రమ కేసులు పెట్టి సంసారానికి పనికి రాకుండా పోలీసులతో కొట్టించారు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినందుకు సిగ్గుపడాలి అంటూ గత ప్రభుత్వంపై అసెంబ్లీ తొలి సమావేశాల్లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘బీఆర్ఎస్ హయాంలో ఫోన్ లో కూడా స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి లేదని కొత్త ఎమ్మెల్యేలు చెప్పారు. రైతు ఆదాయంలో మన రాష్ట్రం 25వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేస్తే పరిస్థితి ఇలా ఎందుకు ఉంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు కావా. రైతు పంటల భీమా పెడితే ఆత్మహత్యలు జరిగేవి కావు. అన్నదాతలు బతకడానికి ప్రభుత్వం సహాయం చేయాలి. కానీ చనిపోతే కాదు’ అని రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

అమరుల కుటుంబాలను ఆదుకోలేదు, కనీసం వారి కుటుంబ సరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కొడుకు కేటీఆర్, అల్లుడుకు మంత్రి పదవి ఇచ్చారు. కుమార్తె కవితను ప్రజలు ఓడిస్తే, ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపు దారులకు సైతం మంత్రి పదవులు ఇచ్చారు. కరోనా మందు బ్లాక్ లో అమ్ముకున్న వారికి రాజ్యసభ సీటు ఇచ్చారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన డిఎస్పీ నళిని తో ఎందుకు మాట్లాడలేదు.. ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యకారులపై ఉన్న కేసులు ఎందుకు ఎత్తివేయ లేదు. ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న మీరు.. తొమ్మిదిన్నర ఎండ్లలో అమరుల కుటుంబాలను ఒక్క రోజైన ప్రగతి భవన్ కు అహ్వానించారా.? అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులను, గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget