అన్వేషించండి

వివేక హత్య కేసులో మరో ట్విస్ట్- హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

వివేక హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

వివేక హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన ఆర్డర్ అంటూ ఆక్షేపించింది. అన్‌ యాక్సెప్టబుల్ అంది. 

వాదనలు పూర్తైన తర్వాత హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపై స్పందించిన అవినాష్ రెడ్డి న్యాయవాది ఇప్పటికిప్పుడు స్టే ఇస్తే తన క్లయింట్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. 

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, రెండు రోజుల వాదనలు తర్వాత ధర్మాసనం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఈ తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సునీత గురువారం సుప్రీంకోర్టును  ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్‌ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. ఇవాళ విచారణకు స్వీకరిస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. 

మూడు రోజులుగా అవినాష్ రెడ్డి విచారణ
వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి అరెస్టు వద్దని హైకోర్టు ఊరట కల్పించినా సీబీఐ విచారణకు మాత్రం వెళ్లాల్సిందేనంటూ స్పష్టం చేసింది. దీంతో వరుసుగా మూడు రోజుల నుంచి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. 

రెండు రోజులుగా సుదీర్ఘంగా అవినాష్ రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. అవినాష్ రెడ్డి రాజకీయ ఎంట్రీపైన కూడా సీబీఐ అధికారులు కూపీ లాగారు. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీల పైన కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రూ.40 కోట్ల డీల్ పై అవినాష్ రెడ్డి పాత్ర ఏంటనేదానిపైన కూడా సీబీఐ అధికారులు ఆరా తీశారు. సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 

కొత్త విచారణ అధికారి వికాస్ సింగ్ కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై దర్యాప్తు జరపాలని అవినాష్ రెడ్డి కోరారు. వివేకా ఫోన్ లో ఉన్న వివరాలు బయట పెట్టాలని అవినాష్ కోరారు. వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ ను ఎందుకు విచారణ చేయడం లేదని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.

అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని, మరో వ్యక్తి ఉదయ్ కుమార్ ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. బుధ, గురువారాల్లో ఉదయం చంచల్ గూడా జైలు నుంచి నిందితులను కస్టడీ లోకి తీసుకొని వాళ్లను కూడా సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటికే ఇద్దరినీ ఆరు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నిందితులతో ఉన్న పరిచయాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. సునీల్ యాదవ్ కు కోటి రూపాయలు ఇచ్చారని దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా చేసుకొని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget