Dussehra Special Train: సికింద్రాబాద్–వాస్కోడిగామా మధ్య ప్రత్యేక రైళ్లు- దసరా రద్దీ తగ్గించేందుకు చర్యలు
South Central Railway: దసరా, దీపావళి సెలవులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు రన్ చేస్తోంది. రద్దీ ఉన్న స్టేషన్ల మధ్య స్పెషల్ ట్రైన్స్ వేస్తోంది.
Secunderabad and Vasco Da Gama : సికింద్రాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటోంది. సాధారణంగా నడిచే రైళ్లు, బస్‌లు, ఇతర రవాణా వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే రద్దీ ఉన్న ప్రాంతాల మధ్య ప్రత్యేక ట్రైన్స్ వేస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్, వాస్కోడిగామా మధ్య స్పెషల్ ఎక్స్‌ప్రెస్ వేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 6,9,10వ తేదీల్లో ఈ రెండు స్టేషన్ల మధ్య ట్రైన్ నడవనుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
07039 నెంబర్‌తో ఉన్న ట్రైన్ 9వ తేదీ అంటే బుధవారం ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో బయల్దేరుతుంది. సాయంత్రం 4.50 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది. అక్కడ 5.05 గంటలకు మళ్లీ బయల్దేరి గురువారం ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా వెళ్తుంది.
అదే ట్రైన్ అదే రోజు ఉదయం 9 గంటలకు వాస్కోడిగామాలో రిటర్న్ అవుతుంది. రాత్రి 8.40 గంటలకు గుంతకల్లు జంక్షన్‌కు అక్కడి నుంచి శుక్రవారం ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ వస్తుంది. ఇది రెగ్యులర్ సర్వీస్.. ఇది కాకుండా వీక్లీ ట్రైన్ కూడా వేశారు.
వీక్లీ ట్రైన్ అదనం
"Introduction of Secunderabad – Vasco-Da-Gama-Secunderabad Bi-Weekly Express" @RailMinIndia @drmsecunderabad @drmgtl pic.twitter.com/18L47fow6L
— South Central Railway (@SCRailwayIndia) October 3, 2024
07039 నెంబర్తో నడిచే వీక్లీ ట్రైన్ ఆరో తేదీ ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబుబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్ మీదుగా సాయంత్రం 6.15 గంటలకు గుంతకల్లు చేరుతుంది. అక్కడ పది నిమిషాలు అగిన తర్వాత మళ్లీ 6.25 గంటలకు బయలుదేరుతుంది. బళ్లారి, హొస్పేట్, కొప్పల్, గదగ్, హుబ్లీ మీదుగా తర్వాత రోజు అంటే సోమవారం ఉదయం 7.20 గంటలకు వాస్కోడిగామాకు స్టేషన్‌కు చేరుతుంది.
దసరా నుంచి వచ్చే పండగలను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే చాలా స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అక్టోబర్ రెండు నుంచే సర్వీస్‌లు ప్రారంభించింది. దాదాపు నెల రోజుల పాటు అంటే నవంబరు ఏడో తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రవైపు ఎక్కువ రైళ్లు వేశారు. సికింద్రాబాద్- శ్రీకాకుళం రూట్‌లో 12 ప్రత్యేక రైళ్లు రన్ చేస్తున్నారు. ప్రతి బుధ, గురువారాల్లో ఈ ప్రత్యేక రైల్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి.
Also Read: వైష్ణోదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. IRCTC నార్త్ ఇండియా టూర్ ప్రత్యేక ప్యాకేజీ!