అన్వేషించండి
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! దక్షిణ మధ్య రైల్వే కీలక మార్పులు, పొడిగింపులు.. మీ ప్రయాణం మరింత సులభం!
Special Trains: రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లలో మార్పులు చేసింది. ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించడం జరిగింది.

ప్రత్యేక రైళ్ల పొడిగింపు, దక్షిణ మధ్య రైల్వే చేసిన మార్పులు ఇవే
Source : X.com
Special Trains: రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లలో మార్పులు చేసింది. ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించడం జరిగింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆయా గమ్య స్థానాల నుండి నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసును పొడిగిస్తూ ఈ ని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పొడిగించిన ఆయా రైళ్ల సర్వీసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి .
| సంఖ్య | రైలు సంఖ్య | రైలు పేరు ( మార్గం) | సర్వీస్ రోజు | పొడిగింపు కాలం (నుంచి- వరకు) | సర్వీసుల సంఖ్య |
| 1. | 07191 | కాచిగూడ – మధురై | సోమవారం | 01.12.25 – 19.01.26 | 08 |
| 2. | 07192 | మధురై – కాచిగూడ | బుధవారం | 03.12.25 – 21.01.26 | 08 |
| 3. | 07193 | హైదరాబాద్ – కొల్లం | శనివారం | 06.12.25 – 17.01.26 | 07 |
| 4. | 07194 | కొల్లం – హైదరాబాద్ | సోమవారం | 08.12.25 – 19.01.26 | 07 |
| 5 | 07230 | హైదరాబాద్ – కన్యాకుమారి | బుధవారం | 03.12.25 – 21.01.26 | 08 |
| 6 | 07229 | కన్యాకుమారి – హైదరాబాద్ | శుక్రవారం | 05.12.25 – 23.01.26 | 08 |
| 7 | 07219 | నరసాపూర్ – తిరువన్నామలై | బుధవారం | 03.12.25 – 21.01.26 | 08 |
| 8 | 07220 | తిరువన్నామలై – నరసాపూర్ | గురువారం | 04.12.25 – 22.01.26 | 08 |
ఈ వివరాలను విజయవాడ డివిజన్, దక్షిణ మధ్య రైల్వే తరఫున పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ Ms. నుస్రత్ M మాండ్రూప్కర్ విడుదల చేయడం జరిగింది. రైల్వే ప్రయాణికులు ఈ మార్పులను గమించి రైల్వే సేవలను వినియోగించుకోవాలని నుస్రత్ సూచించారు.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement





















