News
News
వీడియోలు ఆటలు
X

Singer Sunitha: సింగర్ సునీత భర్త రామ్‌కు బెదిరింపులు, ప్రాణహాని ఉందని బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు

సినిమా నిర్మాతల కౌన్సిల్‌ సభ్యుడిని అంటూ కెకె లక్ష్మణ్‌ అనే వ్యక్తి వీరపనేని రామకృష్ణ ఫోన్‌కు ఓ మెసేజ్ పంపించాడు.

FOLLOW US: 
Share:

ప్రముఖ గాయని సునీత భర్త అయిన వీరపనేని రామకృష్ణకి కొందరి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి ద్వారా తనకు ప్రాణ హాని ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో వీరు నివాసం ఉంటున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సినిమా నిర్మాతల కౌన్సిల్‌ సభ్యుడిని అంటూ కెకె లక్ష్మణ్‌ అనే వ్యక్తి వీరపనేని రామకృష్ణ ఫోన్‌కు ఓ మెసేజ్ పంపించాడు. తనను వ్యక్తిగతంగా కలవాలని ఆ మెసేజ్ ద్వారా కోరాడు. అపరిచిత వ్యక్తి కావడంతో ఆ వ్యక్తిని కలవడానికి రామకృష్ణ ఒప్పుకోలేదు. ఏదైనా బిజినెస్ కి సంబంధించిన విషయం అయితే, తన టీమ్‌ను కలవాలని సూచించారు. కానీ, అందుకు అవతలి వ్యక్తి ఒప్పుకోకుండా వ్యక్తిగతంగానే కలవాలని అనుకుంటున్నట్లుగా తరచూ మెసేజ్‌లు పంపుతున్నాడు. 

ఊరికే మెసేజ్‌లతో వేధిస్తుండటంతో రామకృష్ణ ఆ నంబరును బ్లాక్‌ చేశారు. అంతటితో ఊరుకోని వ్యక్తి 2023 మార్చి 28న ఇంకో కొత్త నంబరుతో మెసేజ్‌లను పంపడం ప్రారంభించాడు. ఈ సారి ఏకంగా బెదిరింపులకు దిగాడు. దీంతో రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు లక్ష్మణ్‌ నుంచి ప్రాణహాని ఉందని, అతణ్ని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ శనివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్‌ పోలీసులు కేకే లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published at : 24 Apr 2023 09:14 AM (IST) Tags: Singer Sunitha Banjara Hills Police Station Sunitha husband ram veerapaneni

సంబంధిత కథనాలు

Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ - టాయిలెట్లు వాడితే డబ్బులు చెల్లించాల్సిందేనట!

Hyderabad Metro News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ - టాయిలెట్లు వాడితే డబ్బులు చెల్లించాల్సిందేనట!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్

టాప్ స్టోరీస్

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు