Siva Balakrishna: శివ బాలకృష్ణ ఏసీబీ విచారణలో సంచలనాలు బయటికి - వారికీ నోటీసులు
Siva Balakrishna HMDA: బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు విచారణ చేశారు. శనివారం (ఫిబ్రవరి 4) ఏసీబీ కార్యాలయానికి సునీల్ ను పిలిచి ప్రశ్నించారు.

Siva Balakrishna Investigation: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నాలుగు రోజుల కస్టడీలో శివ బాలకృష్ణ నుండి కీలక సమాచారాన్ని ఏసీబీ సేకరించింది. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేసింది. మరో ఇద్దరు బాలకృష్ణ బినామీలను కూడా ఏసీబీ గుర్తించింది. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు విచారణ చేశారు. శనివారం (ఫిబ్రవరి 4) ఏసీబీ కార్యాలయానికి సునీల్ ను పిలిచి ప్రశ్నించారు.
సునీల్ అతని భార్యపై ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. జనగామ, గజ్వేల్, కొడకండ్ల, మోత్కూరు, పాలకుర్తి, రిమ్మనగూడ, బీబీనగర్ లో సునీల్ అతని భార్య పేరుపై ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాలకృష్ణకు సోదరుడు సునీల్ బినామీగా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. సునీల్ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు కూడా అధికారులు తేల్చారు. ఎల్బీ నగర్, బంజారాహిల్స్ లో హై రేస్ టవర్స్ ని నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ లో సునీల్ పెట్టుబడి పెట్టారు.
బాలకృష్ణ లాకర్స్ లో గుర్తించిన 20 లక్షల నగదు, బంగారం పలు డాక్యుమెంట్లపై కూడా ఏసీబీ అరా తీసింది. బాలకృష్ణ సెల్ ఫోన్ డేటాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ కాల్ డేటా తీసుకొని విచారణ చేస్తే బాలకృష్ణకు సంబంధించిన బినామీలు, అధికారుల చిట్టా బయటపడే అవకాశం ఉంది. బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

