News
News
X

ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జన్మించిన హనుమంతరావు కుటుంబంలో తండ్రి, పినతండ్రి..ఇలా అంతా వైద్య వృత్తిలో ఉన్నవారే కావడంతో తాను వైద్య రంగంలో సేవలందించాలని ఆశక్తితో వైద్య వృత్తిలో అడుగుపెట్టారు.

FOLLOW US: 
Share:

దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు అందుకున్న డాక్టర్ పసుపులేటి హనుమంతరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా వైద్య సేవా రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా తాను చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రం పద్మశ్రీ ప్రకటించిందని, అయితే ఈ విషయంలో కనీసం తనను సిఎం కేసిఆర్, మంత్రులు ఎవరూ అభినందలు తెలపలేదని, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు అవార్డు గ్రహీత. స్వచ్చంద సేవా సంస్థలను ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు.

సరిగ్గా నలభై ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లో యస్వీకార్ సంస్దను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో మానసిక, శారీరక వికలాంగులకు నామమాత్రం ఫీజుతో వైద్యం అందించడంతోపాటు వాళ్లు తిరిగి మానసిక, శారీరక వైకల్యం నుంచి కోలుకునేంత వరకూ తమ వద్దనే ఆలనా పాలనా చూస్తూ సేవలందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో 85లక్షల మంది మానసిక, శారీరక వికలాంగులకు పునర్జన్మ ఇచ్చారు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పసుపులేటి హనుమంతరావు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జన్మించిన హనుమంతరావు కుటుంబంలో తండ్రి, పినతండ్రి..ఇలా అంతా వైద్య వృత్తిలో ఉన్నవారే కావడంతో తాను వైద్య రంగంలో సేవలందించాలని ఆశక్తితో వైద్య వృత్తిలో అడుగుపెట్టడమే కాదు.సమాజంలో మానసిక వికలాంగులైన పిల్లలను చూసి చలించిపోయారు. నలభై ఏళ్ల క్రితం వికలాంగులైన తన పిల్లలను ఇళ్లు దాటకుండా పరువుపోతుందనే ఉద్దేశ్యంతో గదిలోపెట్టి తాళాలు వేసిన ఘటనలు చూసి చలించిపోయిన హనుమంతరావు అలాంటి పీడిత చిన్నారుల కోసం స్వీకార్ అనే స్వచ్చంద సంస్థను స్దాపించారు. అలా మొదలైన స్వీకార్ ప్రయాణం ఈ నలభై ఏళ్ల కాలంలో లక్షల మంది చిన్నారులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. 700 మంది మానసిక వికాలంగులను శిక్షణ ఇచ్చి ఉద్యోగాలలో నియమించినందుకు కేంద్రం స్వీకార్ సేవలకు గతంలో అనేక అవార్డులు ప్రకటించింది. 500 మంది బధిరులను వివిధ ఉద్యోగాలలో నియమించినందుకు ప్రత్యేక పురస్కారాలతో సత్కరించింది.

సమాజం చిన్నచూపు చూస్తున్న చిన్నారులను అక్కున చేర్చుకుని వారికి వైద్యం అందించడంతోపాటు, విద్య, ఉపాధి, ఉద్యోగం ఇలా వారిని జీవితంలో వారి కాళ్లపైవారు నిలబడేలా తీర్చిదిద్దడంలో స్వీకార్ సేవలు ప్రశంసనీయం. తెలంగాణలో మాత్రమే కాదు ఏపీలో సైతం తమ సేవలను విస్తరించింది స్వీకార్ సంస్థ. అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే సంస్దను స్వీకార్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసి వివిధ విభాగాల్లో సేవలను విస్తృతం చేసింది. కేవలం చిన్న పిల్లలకు మాత్రమే కాదు మద్యం, ధూమపానం ఇలా అనేక చెడు వ్యసనాలకు బానిసలైన పెద్దవాళ్లను సైతం అక్కున చేర్చుకుని వైద్యం అందించి డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దడంతో విశేష కృషి చేసింది. ఇలా నాలుగు దశాబ్దాలుగా స్వీకార్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వీకార్ సంస్ద ఫౌండర్ చైర్మెన్ పుసులేటి హనుమంతరావుకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

ఈ  అవార్డు ప్రకటించిన సందర్భంగా ABP దేశంతో అవార్డు గ్రహీత మాట్లడుతూ ఇప్పటికీ రెండు రోజులైనా పద్మశ్రీ అవార్డు రావడంపై కనీసం తెలంగాణ సిఎం కేసిఆర్,ప్రభుత్వ పెద్దలు ఎవరూ అభినందించలేదని అవేదన వ్యక్తం చేశారు. స్వచ్చంద సంస్థలంటే కేసిఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమాత్రం ఆర్థిక సహాయం లేకున్నా నాలుగు దశాబ్ధాలుగా స్వీకార్ సేవలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. నలభై ఏళ్లుగా తన సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని చూసా ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అయినా కేంద్రం పద్మశ్రీ ప్రకటించడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీరు బాధ కలిగించిందన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈ సందర్భంగా మాట్లడుతూ మానసిక ,శారీరకంగా వికలాంగులైన పిల్లలపై తల్లిదండ్రుల ఆలోచన మారుతోందని, ఈరోజుల్లో వారిని బయటకు తీసుకురావడానికి సైతం తల్లిదండ్రులు వెనుకాడటంలేదని తెలిపారు. అవసరమైన వైద్యం అందించి, మనో ధైర్యం ఇస్తూ విద్య, ఉపాధి శిక్షణలు ఇస్తే మానసిక అంగవైకల్యంతో ఉన్న లక్షల మంది చిన్నారులకు కొత్త జీవితం ప్రసాదించవచ్చని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మారాలని, స్వచ్చంద సేవా సంస్దలను నడపలేని పరిస్దితులున్నా అతి కష్టం మీద సేవలందిస్తున్న నిజాయితీగల సంస్దలను గుర్తించి ఆర్దికంగా చేయూతనివ్వాలని కోరారు.

Published at : 28 Jan 2023 02:39 PM (IST) Tags: Telangana KCR Padma shri award 2023 sweekar Pasupuldti Hanumanth Rao

సంబంధిత కథనాలు

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Modi Flexis on Flyover: హైదరాబాద్‌ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు

Modi Flexis on Flyover: హైదరాబాద్‌ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Crime News: హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

Hyderabad Crime News:  హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

టాప్ స్టోరీస్

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?