Secunderabad Rape: కార్ఖానా బాలిక రేప్ కేసులో గ్యాంగ్ రేప్ జరగలేదు, కానీ - పోలీసులు స్పష్టత
Secunderabad: బాలికపై రెండు నెలలుగా ఐదుగురు యువకులు పలుమార్లు వేర్వేరుగా అత్యాచారానికి పాల్పడ్డట్లుగా పోలీసులు చెప్పారు. ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు.
సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఘటనపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డ మాట వాస్తవమేనని, కానీ అది సామూహిక అత్యాచారం కాదని స్పష్టత ఇచ్చారు. ఫ్రెండ్ షిప్ పేరుతో యువకులు బాలికను మభ్య పెట్టి వేర్వేరుగా తమ లైంగిక వాంఛ తీర్చుకున్నారని తెలిపారు. బాలికపై వేర్వేరుగా లాడ్జీలో లైంగికంగా దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు కాగా, మరో ముగ్గురు మేజర్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ఈ రేప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు. బాలికపై రెండు నెలలుగా ఐదుగురు యువకులు పలుమార్లు వేర్వేరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ లో ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు ఓ బాలికతో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి నెలలో బాలికను హోటల్ కు రప్పించి వీడియోలు తీస్తూ ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి పలుసార్లు లోబర్చుకున్నారు.
అయినా, బాధితురాలు మాత్రం నోరు విప్పలేదు. బాలిక పరిస్థితి చూసి తల్లిదండ్రులు సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తొలుత సామూహిక అత్యాచారంగా ప్రచారం
ఈ ఘటనను తొలుత గ్యాంగ్ రేప్‌గా అంతా భావించారు. తాజాగా పోలీసులు స్పష్టత ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో 17 ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచార ఘటన మర్చిపోక ముందే మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సికింద్రాబాద్ లోని కార్ఖానా పరిధిలో జరిగింది. ఒక బాలికపై ఐదుగురు వ్యక్తులు వేర్వేరుగా అత్యాచారం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రాథమిక వివరాలు ఇవీ.. బాధిత బాలిక ధీరజ్, రితేశ్ అనే యువకులకు ఇన్ స్టాగ్రాంలో పరిచయం. ఆ తర్వాత వారు కలుసుకున్నారు. మాయమాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకున్నారు. అఘాయిత్యానికి పాల్పడే సమయంలో వీడియోలు తీసి ఎక్కడైనా చెప్తే ఆ వీడియోలు బయట పెడతామంటూ బెదిరించారు. ఈ ఘటనలో కూడా బాలిక ప్రవర్తనపై అనుమానం వచ్చి సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటికి వచ్చింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.