అన్వేషించండి

Ganesh laddu: హైదరాబాద్‌లో 21 కిలోల గణేష్‌ లడ్డూ చోరీ- ఎత్తుకెళ్లింది స్కూల్‌ పిల్లలే

హైదరాబాద్‌ పాతబస్తీలో స్కూల్‌ విద్యార్థులు గణేష్‌ లడ్డూని చోరీ చేశారు. మండపంలోకి చొరబడి 21కేజీల లడ్డూని ఎత్తుకెళ్లారు. అంతేకాదు.. గణేష్‌ లడ్డూని పంచుకుని తినేశారు.

వామ్మో... వాళ్లు పిల్లలు కాదు చిచ్చరపిడుగులు. స్కూల్‌కి వెళ్లి చదువుకుంటున్న వయస్సులోనే చోరీలు చేస్తున్నారు. అది కూడా వినాయకుడి ప్రసాదమైన లడ్డూనే  అపహరించేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 21 కేజీల లడ్డూని చోరీ చేశారు. అంతేనా... ఎత్తుకెళ్లిన లడ్డూని ఎంచక్కా గుటకాయ స్వాహా చేసేశారు. ఈ సంఘటన  హైదరాబాద్‌లోని చార్మినార్‌ పరిధిలో జరిగింది.

చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఝాన్సీ బజార్ ప్రాంతంలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా... వినాయక మండలం ఏర్పాటు చేశారు. బొజ్జగణపయ్య ప్రతిష్టించి.. 21 కేజీల  లడ్డూను వినాయకుడి చేతిలో పెట్టారు. అయితే... రోజా ఆ దారిలో స్కూల్‌కి వెళ్తూ.. వస్తున్న ఓ విద్యార్థుల గ్యాంగ్‌ కన్ను.. వినాయకుడి చేతిలోని లడ్డూ పడింది. చూడగానే  నోరూరిందో ఏమో... లడ్డూ కొట్టేదానుమనుకున్నారు. శనివారం సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటి వెళ్తూ... మార్గమధ్యలో ఉన్న ఆ మండపంలోకి చొరబడ్డారు. ఆ సమయంలో  మండపంలో ఎవరూ లేరో ఏమో...వినాయకుడి చేతిలోని 21 కేజీల లడ్డూను అపహరించేశారు. రోడ్డుపై అందరూ తిరుగుతూనే ఉన్నారు... అయినా ఎవరూ గమనించలేదో..  లేక మనకెందుకులే అనుకున్నారో ఏమో మరి. విద్యార్థులకు మాత్రం లడ్డూ కొట్టేసే ఛాన్స్‌ దొరికేసింది. లడ్డూ దొంగిలించగానే.. విద్యార్థుల గ్యాంగ్‌ అంతా కలిసి లడ్డూని  పంచుకుని తినేశారు.

మండపంలోని వినాయకుడి చేతిలో లడ్డూ లేదని నిర్వహకులు గమనించుకునే లోపు అంతా అయిపోయింది. లడ్డూ పోయిందని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... చుట్టపక్క ఉన్న సీసీ కెమెరాలను గమనించారు. దీంతో విద్యార్థుల లడ్డూ చోరీ బాగోతం బయటపడింది. విద్యార్థులు మండపంలో ఎలా  దూరారు.. లడ్డూ ఎలా ఎత్తుకెళ్లారు.. అంతా సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవుతుంది. లడ్డూ చోరీ చేసిన విద్యార్థులు.. దాన్ని  తినేయడంతో చేసేది ఏమీలేక వదిలేసినట్టున్నారు పోలీసులు.

హైదరాబాద్‌లో గల్లీకో వినాయక మండపం ఉంటుంది. ప్రతి వినాయకుడి చేతిలో లడ్డూ ఉంటుంది. గణేష్‌ నవరాత్రుల్లో వినాయకుడితోపాటు లడ్డూకు పూజలు చేస్తారు.  నిమజ్జనం రోజు లడ్డూను వేలం వేస్తారు. నవరాత్రుల్లో పూజలు అందుకున్న ఆ లడ్డూని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసివస్తుందని... విఘ్నాలు తొలగి.. అనుకున్నవన్నీ  నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే గణేష్‌ లడ్డూనే వేలం పాటలో అత్యధిక ధరలు పాడుకుని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. హైదరాబాద్‌ బాలపూర్‌ వినాయకుడి  లడ్డూ ధర లక్షలు పలుకుతుంది. ఇక, వినాయకుడి చేతిలోని ఆ లడ్డూని కొట్టేసేందుకు చాలా మంది కాచుకుని కుర్చోనుంటారు. గణష్‌ లడ్డూని దొంగతనం చేసి తిన్నా  అదృష్టం కలిసివస్తుందని కొందరి నమ్మకం. అందుకే.. వినాయక మండపాల దగ్గర లడ్డూ చోరీ జరగకుండా... ఎవరో ఒకరు కాపలాగా ఉంటారు. వినాయకుడిని  ప్రతిష్టించిన రోజు నుంచి నిమజ్జనం వరకు లడ్డూ ప్రసాదాన్ని కూడా కాపాడుకుంటూ ఉంటారు. ఇక... హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. మహానిమజ్జనానికి కూడా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గురువారం.. భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జనోత్సం ఘనంగా జరగబోతోంది. పోలీసులు, అధికారులు సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. గట్టి బందోబస్తు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget