News
News
X

Sankrati Rush: పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న జనాలు - కిటకిటలాడుతున్న రహదారులు

 Sankrati Rush: సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న వారితో రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

FOLLOW US: 
Share:

Sankrati Rush: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో రహదారులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం నుంచి పండుగ సెలవులు ప్రారంభం అవుతుండగా.. గురువారం రోజు సాయంత్రం నుంచే జనాలు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున పరుగులు తీస్తున్నాయి. పంతంగి టోల్ గేట్ వద్ద కార్లు బారులు తీరాయి. ప్రమాదాలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ జామ్ లు ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు నిరంతరం పరిశీలిస్తూ... వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. 

ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ తప్పని తిప్పలు

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టింది. టోల్‌ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రధాన మార్గాల్లోని  టోల్‌ ప్లాజాల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌లను కేటాయించాలని కోరుతూ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌.హెచ్‌.ఎ.ఐ), తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ విభాగాలకు లేఖలు రాసింది. ఇదే అంశంపై టోల్‌ ప్లాజా నిర్వాహకులనూ సంప్రదించింది. తమ సంస్థ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని కోరింది. ఆర్టీసి అభ్యర్దననకు ఆయా విభాగాల నుండి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి 10వ తేదీ నుంచి ఈ 14 తేదీ  వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద  ప్రత్యేక లేన్‌ను కేటాయిస్తామని సమాచారం అందింది. 

ఇప్పటికే టోల్‌ ప్లాజాల వద్ద టీఎస్‌ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలోని పతంగి, కోర్లపహాడ్‌, హైదరాబాద్‌-వరంగల్‌ మార్గంలోని గూడురు, హైదరాబాద్‌-సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్‌-నిజామాబాద్‌ మార్గంలోని మనోహరబాద్‌, హైదరాబాద్‌-కర్నూలు మార్గంలోని రాయికల్‌ టోల్‌ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఆయా టోల్‌ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించేందుకు ఇప్పటికే ఉద్యోగులకు ఆదేశాలు జారీచేశారు ఆర్టీసి అధికారులు. ఆర్టీసీ బస్సులు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక లేన్‌ నుండి బయటకు వెళ్లేందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా టీఎస్‌ఆర్టీసీ తీసుకోబోతోంది. అయినప్పటికీ టోల్ ప్లాజాల వద్ద సమస్యలు వస్తూన ఉన్నాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూనే ఉంది. 

సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌, ఎంజీబీఎస్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రద్దీ సమయాల్లో టోల్‌ ప్లాజాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్దం చేశారు. ఈ సంక్రాంతికి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది టిఎస్ ఆర్టీసి 4,233 ప్రత్యేక బస్సులను మంగళవారం నుంచి 14వ తేది వరకు నడుపుతున్నారు. ఈ వినూత్న నిర్ణయం ఆర్టీసికి ఈ సంక్రాంతికి లాభాల పంట పండించేలా కనిపిస్తోంది. ప్రైవేట్‌ బస్సులో వెళ్లి టోల్‌ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడే కన్నా.. టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులను కోరుతోంది.

Published at : 13 Jan 2023 12:35 PM (IST) Tags: Hyderabad Roads Sankranthi Festival Telangana News Heavy Traffic jam Pantangi Toll Gate

సంబంధిత కథనాలు

CM KCR Nanded Tour: నాందేడ్ లో ఆదివారం బీఆర్ఎస్ సభ, సీఎం కేసీఆర్‌ పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇలా

CM KCR Nanded Tour: నాందేడ్ లో ఆదివారం బీఆర్ఎస్ సభ, సీఎం కేసీఆర్‌ పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇలా

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్,  అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్

Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్

టాప్ స్టోరీస్

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?

NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?

Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ

Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ