Pride of Telangana Awards: ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2025 కోసం దరఖాస్తులు ఆహ్వానం- ఎవరు అప్లై చేసుకోవచ్చంటే?
Pride of Telangana Awards: ప్రైడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఏటా రౌండ్‌టేబుల్ ఇండియా సంస్థ ఇచ్చే అవార్డుల సీజన్ వచ్చేసింది. ఈసారి కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Pride of Telangana Awards: తెలంగాణలో వివిధ రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించే వారిని సన్మానించి మరెందరికో స్ఫూర్తిగా నిలిపేందుకు ఏటా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ పేరిట అవార్డులు ప్రకటిస్తున్నారు రౌండ్ టేబుల్ ఇండియా అనే సంస్థ. ఈ ఏడాది కూడా అలాంటి వివిధ రంగాల్లో విశేషంగా రాణించిన అచీవర్స్ అండ్ ఎమర్జింగ్ వ్యక్తులను గుర్తించ పని ప్రారంభించారు నిర్వాహకులు. ఈ ఆరో ఎడిషన్‌లో సమాజ అభివృద్ధికి గణనీయంగా దోహదపడిన వ్యక్తులను, సంస్థలను గుర్తించి గౌరవించనుంది
2025 అవార్డుల విభాగాలు
2025 సంవత్సరంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 12 విభాగాలలో ఇవ్వబోతున్నారు. కళలు -సంస్కృతి, ఎన్జీవో, స్టార్ ఉమన్, స్టార్ కిడ్, వినోదం, విద్య, స్టార్ట్-అప్, హెల్త్ కేర్, ఫుడ్ అండ్ బేవరేజెస్, రిటైల్, ఇన్ఫ్రాస్టక్ర్చర్ ,క్రీడ్రా రంగాల్లో విశేషమైన గుర్తింపు పొందిన వారికి అద్భుతమైన సేవలు అందించే వారిని సన్మానిస్తారు.
నామినేషన్ -ఓటింగ్ ప్రక్రియ:
గత ఎడిషన్ 1,700 నామినేషన్లు వస్తే 1,00,000 మంది వారిని ఎంపిక చేశారు. ఈ సంవత్సరం దరఖాస్తు ప్రక్రి 9 ఆగస్టు న ప్రారంభమైంది. ఇది 24 ఆగస్టు 2025 వరకు కొనసాగుతుంది. ఆసక్తి, అర్హులైన వారంతా అప్లై చేసుకోవచ్చు.
ప్రైడ్ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2025 జ్యూ రీ:
ఈ సంవత్సరం అవార్డుల ఎంపిక కోసం వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను జ్యూరీ సభ్యులుగా నియమించారు.
- 1. లక్ష్మీ నంబియార్, సృష్టిఆర్ట్ గ్యాలరీ స్థాపకులు
- 2. మీరా షెనాయ్, యూత్4జాబ్స్ స్థాపకులు
- 3. పి.రఘురామ్, కిమ్స్ -ఉషాలక్ష్మి హాస్పిటల్
- 4. రాజ్ కందుకూరి సినీ నిర్మా త దర్శకుడు
- 5. ఎం.వి.రమణ, డా.రెడ్డీస్ ల్యా బ్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి
- 6. రమేష్ కాజా, స్టేట్ స్ట్రీట్ట్రీ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్, సీఐఓ
- 7. సందీప్ సుల్తానియ, తెలంగాణ పభ్రుత్వ ఆర్థిక కార్యదర్శి
- 8. షాహ్ అజీమ్ హమీద్, ఫెయిర్మౌంట్ బిల్డర్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి
- 9. శ్రీవిద్య రెడ్డి గుణంపల్లి, నారాయణమ్మ ఇన్స్టి ట్యూ ట్ ఆఫ్ టెక్నా లజీ అండ్ సైన్సెస్ ఉపాధ్యక్షులు
- 10. శ్రీనివాస రావు మహంకాళి, టి.హబ్. పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి
ఈ అవార్డులను స్పాన్సర్స్ చేసేవాళ్లు:- టైటిల్ స్పా న్సర్-ఫెయిర్మౌంట్ బిల్డర్స్, ప్రిన్సిపల్ స్పాన్సర్: ఫ్రీడం ఆయిల్.
రౌండ్ టేబుల్ ఇండియా 2024 ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ద్వా రా సమకూర్చిన నిధులను 4 కొత్తస్కూ ల్ బ్లాక్లను
తెలంగాణలో ప్రారంభించారు.
- 1. ZPHS అల్వాల్‌లో 2 తరగతి గదులు
- 2. MPPS గర్ల్స్ మల్కాజ్‌గిరిలో 3 తరగతి గదులు
- 3. MPPS అల్వాల్‌లో 2 తరగతి గదులు
- 4. MPUPS దేవరఫసల్వాద్‌లో 4 తరగతి గదులు
రౌండ్ టేబుల్ ఇండియా 1997 నుంచి 3,782 పాఠశాలలలో 9,272 తరగతి గదులు నిర్మించింది. ఈ కార్యక్రమం 10.02 మిలియన్ పిల్లల విద్యకు దోహదపడుతోంది.
గ్రాండ్ అవార్డ్స్ నైట్:
రౌండ్ టేబుల్ ఇండియా అవార్డుల వేడుక 28 సెప్టెంబర్ 2025న జరగనుంది. ఈ వేడుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిభను గుర్తించి సన్మానించే వేడుకగా చెప్పుకున్నారు.
నామినేషన్‌కు ఆహ్వానం:
తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పాల్గొనేవారు తమను తాము లేదా ఇతరులను నామినేట్ చేయడానికి www.prideoftelangana.com వెబ్‌సైట్లో లేదా info@prideoftelangana.com కు ఇమెయిల్ ద్వా రా తమ ఎంట్రీలను సమర్పించవచ్చు.ఈ వేదిక అర్హులైన వ్యక్తుల కృష్టిని, విజయాలను గుర్తించడానికి ఒక అద్భు తమైన అవకాశాన్నిస్తుంది అన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా తన కార్యక్రమాల ద్వా రా విద్యను ప్రోత్సహించడానికి,సమాజ సేవ చేయడానికి తన నిబద్ధతను కొనసాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఏంటీ రౌండ్ టేబుల్ ఇండియా ?
1927లో ఇంగ్లాండ్‌లోని నార్విచ్‌లో స్థాపించాు రౌండ్ టేబుల్. 52 దేశాలలో 43,000 కంటే ఎక్కు వ మంది సభ్యులతో ఒక గ్లోబల్ ఫ్రెండ్‌షిప్ ఆర్గనైజేషనగా వృద్ధిచెందింది. భారతదేశంలో 1957 నుంచి రౌండ్ టేబుల్ యాక్టివ్‌గా ఉంది. 324 కంటే ఎక్కు వ టేబుల్స్, 4,600+ సభ్యులతో జీరో-ఓవర్‌హెడ్ పాలసీకి పేరు పొందింది.సేకరించిన అన్ని నిధులు లక్ష్యాలకు అనుగుణంగా ఖర్చు పెడుతోంది. వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలల నిర్మాణంపై ఖర్చు పెడుతోందీ RTI.





















