అన్వేషించండి

Revanth Reddy: కుతుబ్ షాహీ టూంబ్స్‌ను సందర్శించిన రేవంత్ - వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సీఎం

Qutub Shahi Heritage Park: కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ వద్ద కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు.

Hyderabad News: హైదరాబాద్ లోని కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌లో అగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రేవంత్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కలిసి పరిశీలించారు. ఆ ఆవరణలో రేవంత్ రెడ్డి అక్కడ మొక్క నాటారు. 2013లో కుతుబ్‌షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును అగాఖాన్‌ ఫౌండేషన్‌ చేపట్టింది. తెలంగాణ సాంస్కృతిక శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తాజాగా ఆ కార్యక్రమ ముగింపు నేడు జరిగింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు ఆనందంతో పాటు గౌరవంగా ఉంది. వేల సంవత్సరాల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణ కు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు మరియు ఇతరులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ప్రతి ఒక్కరు వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్రను వేశారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహి సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయంగా ఉంది.

శతాబ్దాలుగా హైదరాబాద్ 'గంగా-జమునా తెహజీబ్'గా పిలుస్తూ బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనాన్ని చూసింది. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ , సెవెన్ టూంబ్స్ ఔట్స్ షాహిన్ రాజవంశం  నిర్మాణ నైపుణ్యానికి , సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయి. మన ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటం తో పాటు  ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచుతుంది. యునెస్కో  గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయానికి తెలంగాణ గర్వకారణం. 2013లో ఎంఓయూతో ప్రారంభించి,100 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణ తో పాటు 106 ఎకరాల విస్తీర్ణంలో  చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనం. 

ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారానికి , ఉదారతకు తెలంగాణ  ప్రభుత్వం , హైదరాబాద్ ప్రజల తరపున   అభినందనలు , కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా హాజరైన విశిష్ట అతిథులందరికీ, ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ కి ధన్యవాదాలు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్అర్జున్ టెండూల్కర్‌ని కొనుక్కున్న ముంబయి ఇండియన్స్13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Realme GT 7 Pro: ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?
ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
SCR  Sabarimala Special Trains:  ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
AR Rahman's bassist Mohini Dey : రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
Embed widget