అన్వేషించండి

Telangana: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మరో అప్‌డేట్‌- లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదే

Indhiramma Houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్ధిదారులను డెమోగ్రఫిక్ పద్ధతిలో కలెక్టర్లు ఎంపిక చేయనున్నారు.

Revanth Reddy : ఎన్నికల హామీలు అమలు చేయడంలో తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచీ అడుగులు వేస్తోంది.ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే...లబ్ధిదారుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇందిరమ్మ ఇళ్లబాధ్యత కలెక్టర్లకు...
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలో అతి ముఖ్యమైనది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీ నేరవేర్చుకుంటూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం...తాజా ఇందిరమ్మ ఇళ్లపై దృష్టిసారించింది. కేసీఆర్(KCR) చెప్పిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూసి చివరికి పేదలు తీవ్ర నిరాశ చెందారు. బీఆర్‌ఎస్‌(BRS) ఓటమికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కూడా ఒక కారణం. కాబట్టి ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. అడ్డగోలు కేటాయింపులు కాకుండా...అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక బాధ్యత పూర్తిగా కలెక్టర్లకు అప్పగించనున్నారు. 

డెమోగ్రఫిక్‌ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను డెమోగ్రఫిక్ పద్దతిలో ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన ఇళ్లను కేటాయించనున్నారు. అయితే ఎక్కడ ఎంత ఇవ్వాలన్నది కలెక్టరే నిర్ణయిస్తారని ప్రభుత్వం తెలిపింది.సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోవాలని ఆసక్తి ఉన్న వారినే ఎంపిక చేయనున్నారు. అయితే ఎంత స్థలం ఉంటే ఎంపిక చేయాలన్న దానిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయానికి రాలేదు. గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంత స్థలం ఉండాలి...పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉండాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. ప్రాథమిక అంచనా ప్రకారం సొంతంగా స్థలం ఉండి...తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు. అలాగే 2011లో నిర్వహించిన సామాజిక సర్వేలో వారు ఇళ్లు లేనివారిగా పేరు నమోదు చేసుుకుని ఉండాలి. తమ పేరిట ఉన్న ఇంటి  స్థలానికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌ లో పక్కగా ఉండాలి. గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇళ్లు తీసుకుని ఉండకూడదు. ఈ నిబంధనల్లో ఏమైన ఇబ్బందులు తలెత్తితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవచ్చు. గ్రామసభలు ఏర్పాటు చేసి ఎంపికైన  లబ్ధిదారుల పేర్లు ప్రకటించాలి. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లకే ఉంది. 

Also Read: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఫ్యూచర్ సిటీ - విదేశాల్లో ముచ్చెర్ల నగరంపై రేవంత్ విస్తృత ప్రచారం

అర్హులైన అందరికీ ఇళ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన అందరికీ ఇళ్లు ఇస్తామని మంత్రులు తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా ఏళ్ల తరబడి ఎదురుచూసేలా చేయకుండా వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకోసం కేంద్రసాయం కూడా తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకాన్ని దీనికి అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం విధించిన నిబంధనలన్నీ పక్కాగా అమలు చేస్తామని ఇంతకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తాము కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే తెలంగాణ ప్రజలకు అందాల్సిన అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తామని గతంలో సీఎం పదేపదే చెప్పారు. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లు పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: కాంగ్రెస్‌లో శ్రావణ మాస సంబరాలు- సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి రాగానే పదవుల జాతర!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Australia vs India 1st Test : టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Australia vs India 1st Test : టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget