By: ABP Desam | Updated at : 13 Jan 2023 03:02 PM (IST)
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు చనిపోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది అత్యంత దారుణం అని ప్రభుత్వ నిర్లక్షానికి పరాకాష్ఠ అని విమర్శించారు. ‘‘మలక్ పేట ఆసుపత్రిలో కల్వకుర్తికి సిరివెన్నెల, సైదాబాద్ కు చెందిన శివాని చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృత్యువాత పడ్డారు. ఇది హృదయ విదారకరమైన ఘటన. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతోంది.
ప్రభుత్వ వైద్యంలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వ వైఖరి వల్లనే ప్రైవేటు వైద్యం ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ స్థాయి అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో ఇంత ఘోరమా? ప్రభుత్వ వైద్యంపై పూర్తిగా నమ్మకం పోతోంది. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ అపరేషన్ లో ఆపరేషన్ వికటించి నలుగురు బాలింతలు చనిపోయారు. ఆగస్టు చివరి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి బాలింతలు మృత్యువాత పడ్డారు.
నాలుగు నెలల్లోనే మళ్ళీ ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ లోనే ఇలా ఉంటే ఇక మారుమూల పల్లెల్లో అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రజలకు భయం వేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాటలకే పరిమితం అయ్యారు. ఈ ఘటనకు ఆయనే బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. మృత్యువాత పడ్డ పేద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలి’’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆస్పత్రి తప్పు లేదు - మలక్ పేట ఆస్పత్రి వైద్యులు
ఈ ఘటపై మలక్ పేట ఆస్పత్రి సూపరింటెడెంట్ స్పందించారు. ఇద్దరు బాలింతలకు ఈ నెల 11 న సిజేరియన్ చేశామన్నారు. అందులో ఓ మహిళకు12న 4 గంటలకు... హార్ట్ రేట్ పడిపోయిందని, వెంటనే గాంధీకి రిఫర్ చేశామన్నారు. ఆమె గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని చెప్పారు. ఇంకో మహిళకు అప్పటికే హైపో థైరాడిజం ఉండడంతో... 12న రాత్రి షుగర్ లెవల్స్ పడిపోవడంతో గాంధీకి తరలించారని, ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని తెలిపారు. ఈ కేసుల్లో వైద్యుల నిర్లక్ష్యం లేదని, ఆపరేషన్ కి ముందు అన్ని పరీక్షలు చేశామని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే ?
మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందినట్టు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై గాంధి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాలింతలు చనిపోయారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఛాదర్ ఘాట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతరం మలక్ పేట ఏరియా ఆసుపత్రి ముందు బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు.
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్!
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా- హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు!
Hyderabad: ఒకరోజులో 20 ఇళ్లలో దొంగతనాలు! అవాక్కైన పోలీసులు - ఎట్టకేలకు అరెస్టు
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!