News
News
X

ఐకియాకు మంత్రి కేటీఆర్ సీరియస్ వార్నింగ్

భాగ్యనగరంలో ఉన్న ఐకియా స్టోర్ జాత్యాహంకార వివక్ష ఘటన కలకలం రేపుతోంది. విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

FOLLOW US: 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జాతి వివక్ష ఘటన సంచలనం రేపుతోంది. గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో ఉన్న అంతర్జాతీయ ఐకియా స్టోర్‌లో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. భౌగోళికంగా నివాస పరంగా హైదరాబాద్‌లో ఎంతో సౌలభ్యంగా ఉండటంతో చాలా మంది ఇక్కడ నివసించేందుకు ఇష్టపడుతుంటారు. విశ్వనగరంగా పేరు గాంచిన హైదరాబాద్‌లో జాతి వివక్ష కలకలం రేపింది. ఇప్పటికే చాలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఐకియా.. తాజాగా జాతి వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటోంది.  

నితిన్ సేథి అనే జర్నలిస్ట్ తన భార్యతో కలిసి హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ కు షాపింగ్ కోసం వెళ్లారు. అయితే ఎవరినీ అంతగా చెక్ చేయని సిబ్బంది తమను మాత్రం.. సెక్యూరిటీ పేరుతో ఇబ్బంది పెట్టి అవమానిచారని నితిన్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజెన్లు నితిన్ సేథికి మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఐకియా సిబ్బంది వ్యవహరించిన తీరు ఆమోద యోగ్యంగా లేదన్నారు. అంతర్జాతీయ ఐకియా స్టోర్ లో ఇలా చేయడం ఏంటని, ఇది కరెక్టు కాదని తెలిపారు. జర్నలిస్ట్ నితిన్ సేథికి వెంటనే క్షమాపణలు చెప్పాడని సూచించారు. కస్టమర్లతో గౌరవంగా ఎలా నడుచుకోవాలో సిబ్బందికి అవగాహని కల్పించాలని ఐకియా యాజమాన్యానికి సూచించారు. 

ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ ఐకియా యాజమాన్యం.. తమ స్టోర్ ల వద్ద సమానత్వం మానవ హక్కు అని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. అన్ని రకాల జాత్యాహంకారం, పక్షపాతులను తాము ఖండిస్తున్నామని.. బాధితులకు కల్గిన అవమానానికి చింతిస్తున్నట్లు ట్వీట్ చేసింది. జర్నలిస్ట్ నితిన్ సేథికి క్షమాపణలు తెల్పింది.

Published at : 29 Aug 2022 08:24 PM (IST) Tags: Ikea Racist Discrimination KTR Tweet About Ikea Racism Racist Discrimination Against Journalist Couple Hyderabad Ikea Store Latest News Journalis Nithin Sethi Twitter

సంబంధిత కథనాలు

Minister Gudivada Amarnath : కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో వైసీపీ లేదు, మంత్రి హరీశ్ రావుపై గుడివాడ అమర్ నాథ్ ఫైర్

Minister Gudivada Amarnath : కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో వైసీపీ లేదు, మంత్రి హరీశ్ రావుపై గుడివాడ అమర్ నాథ్ ఫైర్

పబ్‌లో మైనర్‌ డ్యాన్స్, మంత్రులకు, అధికారులకు వీడియో ట్యాగ్‌!

పబ్‌లో మైనర్‌ డ్యాన్స్, మంత్రులకు, అధికారులకు  వీడియో  ట్యాగ్‌!

Secunderabad News : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలుడి కిడ్నాప్, రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు!

Secunderabad News : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలుడి కిడ్నాప్, రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు!

Hyderabad News: మీ వెహికిల్ ఇక్కడ పార్క్ చేశారో ఇక అంతే! Hyd లో ట్రాఫిక్ సమస్యకు కొత్త స్ట్రాటజీ

Hyderabad News: మీ వెహికిల్ ఇక్కడ పార్క్ చేశారో ఇక అంతే! Hyd లో ట్రాఫిక్ సమస్యకు కొత్త స్ట్రాటజీ

Hyderabad Traffic: నేడు ఈ మార్గాల్లో వెళ్లేవారికి అలర్ట్! ఈ టైంలో ట్రాఫిక్ అడ్డంకులు, మరో దారి చూసుకోవాల్సిందే!

Hyderabad Traffic: నేడు ఈ మార్గాల్లో వెళ్లేవారికి అలర్ట్! ఈ టైంలో ట్రాఫిక్ అడ్డంకులు, మరో దారి చూసుకోవాల్సిందే!

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!