Pubs In Hyderabad: పబ్‌లు అలా నడపాలంటే రాష్ట్రం వదిలి వెళ్లిపోండి - పబ్ నిర్వాహకులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
Telangana Excise Minister Srinivas Goud: ఎక్సైజ్ శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, పబ్ అక్రమంగా నడపాలంటే వేరే రాష్ట్రం పోండి అని పబ్ నిర్వాహకులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.
Pubs In Hyderabad: కొందరు చీడ పురుగులు వల్ల రాష్ట్రానికే చెడ్డపేరు వస్తుందని, అందులో మా పార్టీ వ్యక్తి ఉన్నా వదిలేది లేదన్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ప్రజల కోసం ప్రాణాలకు తెగించి సాధించుకున్న రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి కానీ పేరు చెడగొట్టొద్దన్నారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, పబ్ అక్రమంగా నడపాలంటే వేరే రాష్ట్రం పోండి అని పబ్ నిర్వాహకులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. పబ్ నిర్వాహకులు, ఎక్సైజ్ అధికారులతో Telangana Excise Minister Srinivas Goud సమీక్షా సమావేశం నిర్వహించారు.
పబ్ నిర్వాహకులు, ఎక్సైజ్ అధికారులతో సమీక్ష
ప్రాణాలకు తెగించి సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా అసలు సహించేది లేదు. ముఖ్యంగా పబ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గీత దాటితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. పబ్‌లో అసాంఘిక కార్యక్రమాలు వెంటనే నిలిపివేయాలి. పబ్ ను పూర్తి స్థాయిలో సిసి కెమెరాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. అలా కెమెరాలు ఏర్పాటు చేయని పబ్ ను మూసివేయండి. దాని వల్ల వచ్చే నష్టమేమీ లేదన్నారు. అదే విధంగా పబ్ కెమెరాలను పోలీసులకు అనుసంధానం చెయ్యాలని సూచించారు. పబ్ లో మంచి బ్రాండ్ లు, మంచి ఫుడ్ అందుబాటులో ఉంచాలని, లైట్ మ్యూజిక్ ఉంటే చాలు అన్నారు. అశ్లీలం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుటామని పబ్ నిర్వాహకులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
Also Read: Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్
ఇటీవల బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ పబ్‌లో టాస్క్ ఫోర్స్ అర్ధరాత్రి దాడులు జరిపి 150 మందిని పీఎస్‌కు తరలించారు. అందులో బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక, మరికొందరు ప్రముఖులు ఉన్నారు. అయితే పబ్‌లో కొందరు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నారని, వారి వివరాలు సేకరించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పబ్ నిర్వాహకులు, మేనేజర్ సహా కొందర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఓ డ్రగ్ పెడ్లర్‌ను సైతం అదుపులోకి తీసుకుని ఎవరెవరికి డ్రగ్స్ విక్రయాలు జరిపారనే కోణంలో పబ్ లో డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read: Khammam News: వీడు మామూలోడు కాదు - లాకప్‌లో పినాయిల్ తాగి, ప్లాన్ ప్రకారం ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్