అన్వేషించండి

Amrit Bharat Express: తిరుపతి, శబరిమల, తిరువనంతపురం ప్రయాణికులకు గుడ్ న్యూస్! పెర్మనెంట్ అమృత్ భారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ

Amrit Bharat Express: తిరుపతి, శబరిమల, తిరువనంత పురం ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెబుతూ పెర్మనెంట్ అమృత్ భారత్ ట్రైన్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

Amrit Bharat Express: తెలుగు ప్రజలకు అమృత్ భారత్ 2.0 ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు హైదరాబాద్‌లోని చర్లపల్లి, కేరళలోని తిరువనంతపురం మధ్య నడుస్తుంది. వీటితోపటు మరో నాలుగు రైళ్లకు కూడా ప్రధాన మంత్రి జెండా ఊపారు. 

చర్లపల్లి నుంచి రేణిగుంట మీదుగా తిరువనంతపురం వెళ్లే ట్రైన్ నెంబర్ 17041 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్‌ను రిపబ్లిక్ డే కానుకగా దక్షిణ మధ్య రైల్వే ప్రవేశ పెట్టింది. ఈ మంగళవారం (27.01.2026)న తొలిసారిగా చర్లపల్లి నుంచి బయలుదేరి కేరళలోని తిరువనంతపురం (నార్త్) వెళుతుంది ఈ వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్. ప్రతీ మంగళవారం ఉదయం 7:15కి చర్లపల్లిలో బయలుదేరే ఈ ట్రైన్ బుధవారం మధ్యాహ్నం 2:45కి తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ బుకింగ్స్ ఈరోజు (23.01.26) ఉదయం నుంచి ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే CPRO A. శ్రీధర్ ఒక ప్రకటన లో  తెలిపారు.

ఈ ట్రైన్ షెడ్యూల్.. స్టాపులు ఇవే 

ప్రతీ మంగళవారం ఉదయం 7:15కి చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరే 17041 నెంబర్ గల ఈ ట్రైన్ నల్గొండ 8:37, మిర్యాలగూడ 9:06, సత్తెనపల్లి 10:40, గుంటూరు 11:20, తెనాలి 13:43, బాపట్ల 14:28, ఒంగోలు 15:48 నెల్లూరు 17:23, రేణిగుంట 19:20, తిరుత్తణి 20:08, కాట్పాడి 21:25, జోలర్ పేట్ 22:50, సేలం బుధవారం 00:37, ఈరోడ్ 3:10, తిరుప్పూర్ 3:58, కోయంబత్తూరు 4:57, పాలక్కాడ్ జంక్షన్ 7:25, త్రిసూర్ 9:02 ఆలువా 9:55, ఎర్నాకులం టౌన్ 10:17, కొట్టాయం 11:12, చంగనస్సేరి 11:31, తిరువల్ల 11:41, చెంగన్నూరు 11:52, మావెలికార 12:05, కాయంకుల్లం 12:15, కరుణగపల్లి 12:31, కొల్లాం 12:55,వార్కలా 13:13, తిరువనంతపురం నార్త్  14:45.

తిరుగు ప్రయాణం లో 17042 నెంబర్ గల అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ప్రతీ బుధవారం సాయంత్రం 5:30కి తిరువనంతపురం నార్త్ స్టేషన్ లో బయలుదేరి గురువారం రాత్రి 11:30కి చర్లపల్లి చేరుకుంటుంది.

ఎన్ని బోగీలు ఉంటాయాంటే

ఈ వీక్లీ ట్రైన్ "అమృత్ భారత్ " కేటగిరీకి చెందినది కావడంతో ఏకంగా 11 జనరల్ క్లాస్, 8 స్లీపర్ క్లాస్, 2 -సెకండ్ క్లాస్ (దివ్యాంగుల కోసం), 1 పాంట్రీ కార్ ఉంటాయి. సెకండ్ క్లాస్ కోచెస్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ ఖర్చుతోనే వేగంగా తమ తమ ప్రాంతాలు చేరుకునే అవకాశం ఈ రైల్లో ఉంటుంది.

మూడు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు మంచి అప్షన్ ఈ ట్రైన్ 

చర్లపల్లి -తిరువనంత పురం (నార్త్ ) వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ఏకంగా మూడు ప్రసిద్ద పుణ్య క్షేత్రాలకు వెళ్లే తెలుగు భక్తులకు అందుబాటులో ఉండే ట్రైన్. తిరుమల (రేణిగుంట ) శబరిమల (కొల్లాం, చెంగన్నుర్), పద్మనాభస్వామి (తిరువనంత పురం ) క్షేత్రాలకు తక్కువ ఖర్చుతో వెళ్లడానికి భక్తులకు ఈ ట్రైన్ మంచి అప్షన్ అని చెప్పవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget