By: ABP Desam | Updated at : 17 Feb 2023 12:34 PM (IST)
Edited By: jyothi
సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ - నూరేళ్ల బతకాలని కోరుకుంటున్న ప్రముఖులు
Happy Birthday CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తన 69వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అంటే ఈ రోజుతో సీఎం కేసీఆర్ ఏడు పదుల వయసులోకి చేరుకుంటారు. ఆయనకు ఇది చాలా కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఓ సామాన్య ఫ్యామిలీలో పుట్టిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించి నేషనల్ ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళి సై, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Birthday greetings to Telangana CM Shri KCR Garu. I pray for his long life and good health. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2023
అలాగే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. గౌరవ నీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
గౌరవనీయులైన @TelanganaCMO శ్రీ కె చంద్రశేఖర్ రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 17, 2023
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వివరించారు. ప్రజా జీవితంలో తనదైన పంథాను కల్గిన కేసీఆర్ గారికి సంతోషకరమైన జీవితం ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్థిగా కోరుటుంటున్నానంటూ ట్వీట్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈశ్వరుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
Warm birthday wishes to Hon’ble Chief Minister of Telangana Shri K Chandrashekar Rao ji.
— Himanta Biswa Sarma (@himantabiswa) February 17, 2023
May Maa Kamakhya and Mahapurush Srimanta Sankardev bless him with good health and a long life.@TelanganaCMO
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు సీఎం కేసీఆర్ కు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సుదీర్ఘమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. @TelanganaCMO
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 17, 2023
TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం
TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత
UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఫీజు!