Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మలుపు! ప్రణీత్ రావు చేసిన పనికి తలలు పట్టుకుంటున్న పోలీసులు
Telangana News: ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు విలువైన భూములకు సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
Praneeth Rao SIB: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మరో మలుపు చోటు చేసుకుంది. గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) సేకరించిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు గ్యాంగ్ నాశనం చేసినట్లుగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు విలువైన భూములకు సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావు తాజా డేటాను మాత్రమే కాకుండా దశాబ్దాలుగా SIB సేకరించిన సమాచారం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తం 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్ డిస్కులను కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేశారని గుర్తించారు. ఇలా ఈ హార్డ్ డిస్కులను మూసీ నదిలో పడేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం మారుతుందని తెలియగానే ప్రణీత్ రావు మొత్తం డేటా నాశనం చేసినట్లుగా భావిస్తున్నారు. ప్రణీత్ రావు చేసిన పనితో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.