Gaddar Cremation: గద్దర్ అంత్యక్రియలు పూర్తి - బౌద్ధ సాంప్రదాయం ప్రకారం ఖననం
మహాబోధి స్కూల్ ప్రాంగణానికి వివిధ రాజకీయప్రముఖులు, మంత్రులు, విపక్ష నేతలతోపాటు, సినీ రంగం నుంచి ఆర్ నారాయణ మూర్తి తదితరులు హాజరు అయ్యారు.
వాగ్గేయకారుడు, ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ అల్వాల్‌లోని మహాభోది స్కూల్ ప్రాంగణంలో గద్దర్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మహాబోధి స్కూల్ ప్రాంగణానికి వివిధ రాజకీయప్రముఖులు, మంత్రులు, విపక్ష నేతలతోపాటు, సినీ రంగం నుంచి ఆర్ నారాయణ మూర్తి తదితరులు హాజరు అయ్యారు. అంత్యక్రియల సమయంలో కళాకారులు ప్రార్థన చేస్తూ గద్దర్ కు నివాళి అర్పించారు.
అంత్యక్రియల్లో ఓ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ మరణం
గద్దర్ అంత్యక్రియల్లో అభిమానులను కట్టడి చేయకపోవడంతో అపశ్రుతి చోటు చేసుకుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఆయనను సియాసత్ వార్తాసంస్థ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గా గుర్తించారు. ఈయన గద్దర్‌కు సన్నిహితుడుగా ఉండేవారని చెబుతున్నారు. గద్దర్ ఇంటి వద్ద జహీరుద్దీన్ అలీఖాన్ కు గుండెపోటు వచ్చి కింద పడిపోయినట్లుగా భావిస్తున్నారు. పడిపోయిన జహీరుద్దీన్ అలీ ఖాన్‌ను స్థానికులు పక్కనే ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లుగా డాక్టర్ వెల్లడించినట్లుగా సమాచారం.