పీఎం సూర్య ఘర్ అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ తో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత డిస్కామ్ అనుమతితో సోలార్ ప్లాంట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
PM Surya Ghar Yojana: విద్యుత్ బిల్లు ఆదాతో పాటు ఆదాయం.. రూ.78 వేల వరకు సబ్సిడీ.. పీఎం సూర్య ఘర్ స్కీమ్ పూర్తి వివరాలు ఇవే!
PM Surya Ghar Yojana: పీఎం సూర్య ఘర్ యోజన స్కీమ్ ద్వారా ఇంటికి సోలార్ రూఫ్ టాప్ అమర్చుకోవచ్చు. దీంతో విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. అలాగే అదనపు విద్యుత్ విక్రయంతో ఆదాయం కూడా పొందవచ్చు.

PM Surya Ghar Yojana: మీ ఇంటి విద్యుత్ బిల్లు తగ్గించుకోవడమే కాకుండా డబ్బు కూడా సంపాదించవచ్చు. అదేలా అంటారా? ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన్ (PM Surya Ghar Yojana) స్కీమ్ తో ఇంటికి సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కోటి మందికి సోలార్ పవర్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటికి గరిష్టంగా 3 కిలోవాట్లకు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తోంది.
సబ్సిడీ ఎంత?
పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ స్కీమ్‌లో రాయితీ కింద ఒక్కో కిలోవాట్‌కు రూ.30 వేలు సబ్సిడీ, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటుకు రూ.1.45 లక్షలు ఖర్చయితే ఇందులో కేంద్రం రూ.78 వేలు రాయితీగా ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్‌గా ఇస్తాయి.
నెలకు 0-150 యూనిట్ల కరెంట్ వాడేవారికి 1-2 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ సరిపోతుంది. 150-300 యూనిట్లు విద్యుత్ వినియోగించే వారు 2-3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 300 యూనిట్లకు దాటి విద్యుత్‌ను వినియోగిస్తుంటే.. 3 కిలోవాట్, ఆ పై సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ కు రూ.78 వేలు వరకు కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది. మీరు వాడుకోగా మిగిలిన విద్యుత్ ను డిస్కామ్ లకు విక్రయించి ఆదాయం పొందవచ్చు.
ఎంత విద్యుత్ ఆదా?
1 కిలోవాట్‌కు సుమారు 120 యూనిట్ల విద్యుత్ జనరేట్ అవుతుంది. నెలకు మీకు రూ.1000 విద్యుత్ బిల్లు వస్తుంచే.. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో రూ.338 ఖర్చు మాత్రమే అవుతుంది. దీంతో ఏడాదికి రూ.8 వేలు వరకు ఆదా అవుతుంది. అదే నెలకు 240 యూనిట్లు వాడితే రూ.2 వేల వరకు బిల్లు వస్తుందనుకోండి. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో రూ.333 బిల్లు మాత్రమే వస్తుంది. 360 యూనిట్లు వాడుకునే వారికి ఏటా రూ.32 వేల వరకు డబ్బు ఆదా అవుతుంది. అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయం ద్వారా ఏడాదికి రూ.17,000 నుండి రూ.18,000 వరకు ఆదాయం పొందవచ్చు.
Also Read: 50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం
అర్హతలు
- భారత పౌరుడై ఉండాలి.
- సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్‌కు అనువైన పైకప్పు ఉన్న ఇల్లు ఉండాలి.
- రన్నింగ్ విద్యుత్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.
- ఇతర ఏవిధమైన సోలార్ ప్యానెల్ సబ్సిడీలను పొంది ఉండకూడదు
పీఎం సూర్య ఘర్ స్కీమ్ కు ఎలా అప్లై చేసుకోవాలి?
1. పీఎం సూర్యఘర్ వెబ్ సైట్ https://pmsuryaghar.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీ, విద్యుత్ కనెక్షన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
2. కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి రూఫ్‌టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి.
3. అప్లికేషన్ పూర్తి చేసి డిస్కమ్ నుంచి పర్మిషన్ వచ్చే వరకు వేచి ఉండాలి. డిస్కమ్ అనుమతి వచ్చిన తర్వాత రిజిస్ట్రర్డ్ విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
4. ఇన్‌స్టాలేషన్ పూర్తి చేసిన సోలార్ ప్లాంట్ వివరాలను పీఎం సూర్య ఘర్ పోర్టల్‌లో సబ్మిట్ చేసి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి.
5. నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ అయ్యాక, డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
6. ఈ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మీ బ్యాంకు అకౌంట్ వివరాలు, క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. దీంతో 30 రోజుల్లోగా మీ బ్యాంక్ అకౌంట్ లో సబ్సిడీ డిపాజిట్ అవుతుంది.
Also Read: రూ.3 లక్షల లోన్ పై రూ.90 వేల సబ్సిడీ, సున్నా వడ్డీ.. ఉద్యోగిని స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
Frequently Asked Questions
పీఎం సూర్య ఘర్ స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ట్రెండింగ్ వార్తలు






















