PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్
PM Modi Telangana Tour: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో భారీగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ మే 26 తెలంగాణకు విచ్చేయనున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( Indian School of Business) 20వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సోషల్ మీడియాలో కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు రంగంలోకి దిగారు. ఐఎస్‌బీ క్యాంపస్‌ను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఐఎస్‌బీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీరిలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉండనున్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా ఖాతాలను కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడపడుతున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏవైనా పోస్టులు పెట్టారా? అని వాళ్ల అకౌంట్లను చెక్ చేస్తున్నారు. అంతేకాక, విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను కూడా ఎస్పీజీ అధికారులు పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాల్లో ఏ సమస్య లేదని తేలితేనే విద్యార్థులకు ఎంట్రీ పాసులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాదించిన 8 మందికి ప్రధాని మోదీ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందించనున్నట్లు ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల చెప్పారు.
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన అధికారిక షెడ్యూల్:
మే 26న మధ్యాహ్నం 1 .30 గంటల కి బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ
1.45 వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ లో బీజేపీ నేతలతో మీటింగ్
1.50 కి హెలికాప్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు మోదీ. హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన 2 కి.మీ. ప్రయాణించి ఐఎస్‌బీకి
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
తిరిగి సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు మోదీ
4 .15 గంటలకు బేగంపేట్ నుంచి చెన్నై కి బయలుదేరనున్న ప్రధాని
మోదీ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు...
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో 2000 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్నాతకోత్సవం కు వచ్చే విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈఎస్బి, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా బందోబస్తు ఏర్పాట్లు చేసింది. డ్రోన్ కెమెరాలకు అనుమతి నిరాకరించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సెలవులో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీకి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.
Also Read: Hyderabadకి ప్రధాని మోదీ, ఈ రూట్‌లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ