Hyderabad Blast Plan Case: 5 రాష్ట్రాల్లో పేలుళ్ల కోసం నిందితులు రెక్కీ- సమీర్, సిరాజ్ విచారణలో సంచలన విషయాలు
Terror Bid Foiled In Hyderabad Vizianagaram : బాంబు దాడులకు ప్లాన్ చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేసిన సమీర్, సిరాజ్ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Vizianagaram Blasts Plan Case | విజయనగరం: హైదరాబాద్‌లో పేలుళ్లకు విజయనగరంలో కుట్ర కేసు నిందితుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు సమీర్, సిరాజ్ స్టేట్మెంట్ లను ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు ఆదివారం నమోదు చేశారు. నిందితులో సిరాజ్, సమీర్ బాంబు పేలుళ్ల కోసం ఐదు చోట్ల రెక్కి నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. విజయనగరంతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాలలో బాంబు పేలుళ్ల కోసం రెక్కి నిర్వహించినట్లు విచారణలో తేలింది. విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాత్ర పై సైతం అధికారులు ఆరా తీస్తున్నారు.
మొత్తం 12 మందితో సోషల్ మీడియా గ్రూప్
ఇద్దరు నిందితులు హైదరాబాద్, విజయనగరంలో ఇటీవల అరెస్టు చేశారు. ఆ సమయంలో కేవలం హైదరాబాదులో పేలుళ్ల కోసం విజయనగరంలో ప్లాన్ చేసినట్టుగా అధికారులు భావించారు. కానీ NIA అధికారుల విచారణలో నాలుగైదు రాష్ట్రాల్లో బాంబు దాడులకు నిందితులు ప్లాన్ చేసినట్టు తేలింది. దిల్‌సుఖ్‌నగర్‌లో దశాబ్దం కిందట జరిగిన టిఫిన్ బాక్స్ బాంబు దాడి లాంటి వాటికి నిందితులు కుట్ర చేశారు. నిందితులు సోషల్ మీడియా లో గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూపులో మొదట ఆరు మంది ఉన్నారని అధికారులు భావించారు. కానీ మొత్తం 12 మంది నిందితులు ఆ సోషల్ మీడియా గ్రూపులో ఉన్నట్లు NIA గుర్తించింది. అందులోనే నిందితులు తమ ప్లాన్, ఇతర చర్చలు జరిపేవారు.
సౌదీ హ్యాండర్ల నుంచి వచ్చిన నిధులపై ఆరా
ఈ నిందితులు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినవారు. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లు, అహీమ్ సంస్థ మూలాలతో పాటు వారికి ఇటీవల వచ్చిన విదేశీ కాల్స్‌పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. వీరికి సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు రావడంతో బాంబుదాడులకు టిఫిన్ బాక్స్, పేలుడు పదార్థాలు సైతం కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడయింది. సౌదీ నుంచి వచ్చిన నిధులు ఏ ఖాతాలో జాయిన్ అయ్యాయి, వాటిని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనే దానిపై ఎన్ఐఏ అధికారులు ఊపి లాగుతున్నారు.






















