Fact Check: కొత్త సెక్రటేరియట్‌పై నీళ్లు నిలిచాయా? ఆ వైరల్ వీడియో ఏంటి? అసలు సంగతి ఇదీ
సెక్రటేరియట్ పైన నీరు నిలిచిపోయిందని తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఆ నీళ్లని తోడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
తెలంగాణ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ ను ఎంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, ప్రారంభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రూ.600 కోట్లకు పైగా నిధులు వెచ్చించి రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా, జాతి గర్వపడేలా నిర్మించారు. అయితే, సెక్రటేరియట్ పైన నీరు నిలిచిపోయిందని తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఆ నీళ్లని తోడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. రాష్ట్రంలో విపక్షాలకు చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఆ భవనం తెలంగాణ సెక్రటేరియట్ ను పోలినవిధంగానే ఉంది.
మీడియా సెంటర్ లోకి నీరు!
అంతేకాకుండా, కొత్త సచివాలయం మీడియా సెంటర్‌లోకి కూడా రెండు రోజు రోజుల క్రితం వాటర్ లీక్ అయిన విషయం బయటికి వచ్చింది. శ్లాబ్ మీద నిలిచిన నీరు హాల్‌లోకి లీక్ అయిందని, పిల్లర్‌కి కూడా పగుళ్ళు వచ్చాయని ఫోటోలు బయటికి వచ్చాయి. దానికి తోడు శ్లాబ్ నుంచి నీటి చెమ్మగా మారినట్లుగా ఆ ఫోటోల్లో కనిపించింది.
రెండ్రోజుల క్రితం తొలి రోజు సెక్రటేరియట్ కి వచ్చిన ఉద్యోగుల ఫీలింగ్ తెలుసుకోడానికి అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులకు ఆ సెంటర్ లో నీళ్లు కనిపించాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో సచివాలయాన్ని కట్టినా మీడియా సెంటర్ విషయంలో నిర్లక్ష్యం ఏంటని విలేకరులు ప్రశ్నించారు.
ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు, టీఆర్ఎస్ వ్యతిరేకులు కామెంట్లు చేశారు. అకాల వర్షాలకే మీడియా సెంటర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక తుపాను సమయాల్లో, వర్షాకాలంలో ఇంకెంత ఘోరంగా ఉంటుందోనని కామెంట్లు చేశారు.
తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీం ఏం చెప్పిందంటే..
ఈ వైరల్ అవుతున్న వీడియోల పట్ల తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది. ఆ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్న భవనం తెలంగాణ సెక్రటేరియట్ అని, కానీ నీళ్లు నిలిచిన భవనం మాత్రం సచివాలయ ప్రాంగణం బయట ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ అని వివరించారు. అది ప్రస్తుతం నిర్మాణంలో ఉందని స్పష్టం చేసింది.
‘‘ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెలంగాణ సెక్రటేరియట్‌పై నీరు నిలిచింది అంటూ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో ప్రజలని పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉంది. వీడియోలో కనిపించేది నూతన సచివాలయం బయట నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కాంప్లెక్స్ పై నీరు నిలిస్తే దాన్ని సెక్రటేరియట్‌పై నీరు నిలిచింది అని వీడియోలో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి’’ అని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీం ట్వీట్ చేసింది.
#MisleadingVideoAlert
— FactCheck_Telangana (@FactCheck_TS) May 3, 2023
ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెలంగాణ సెక్రటేరియట్‌పై నీరు నిలిచింది అంటూ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో ప్రజలని పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉంది.
వీడియోలో కనిపించేది నూతన సచివాలయం బయట నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్.
ఈ కాంప్లెక్స్… pic.twitter.com/kfxDqV8oHh