Miniter Talasani Srinivas: ఈనెల 5న బన్సీలాల్ పేట మెట్ల బావి ప్రారంభం: మంత్రి తలసాని
Miniter Talasani Srinivas: ఈనెల 5వ తేదీన సికింద్రాబాద్ బన్సీలాల్ పేట మెట్ల బావిని మంత్రి కేటీఆర్ చేతుల మీదుహా ప్రారంభించబోతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
![Miniter Talasani Srinivas: ఈనెల 5న బన్సీలాల్ పేట మెట్ల బావి ప్రారంభం: మంత్రి తలసాని Minister Talasani Srinivas Yadav Comments on Bansilalpet Metla Bavi Step Well in Hyderabad Miniter Talasani Srinivas: ఈనెల 5న బన్సీలాల్ పేట మెట్ల బావి ప్రారంభం: మంత్రి తలసాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/03/c592caef2344eba6eb214e0d22054efb1670047743405519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Talasani Srinivas: ఈనెల 5వ తేదీన అంటే సోమవారం రోజు సికింద్రాబాద్ బన్సీలాల్ పేట మెట్ల బావిని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన శుక్రవారం రోజు పరిశీలించారు. మంత్రి తలసానితోపాటు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, స్థానిక కార్పొరేటర్ కే. హేమలత, తలసాని సాయి కిరణ్ యాదవ్, పవన్ కుమార్ గౌడ్ లతో పాటు వివిద విభాగాల అధికారులు ఉన్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ... ఈనెల 5వ తేదీ సోమవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ కోనేరు బావిని ప్రారంభిస్తారని వివరించారు.
ఈ నెల 5వ తేదీన గౌరవ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించనున్న బన్సీలాల్ పేట మెట్ల బావి వద్ద మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ గారితో కలిసి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. @arvindkumar_ias pic.twitter.com/jfzd4bc8eg
— Talasani Srinivas Yadav (@YadavTalasani) December 2, 2022
ఈ నెల 5వ తేదీన గౌరవ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించనున్న బన్సీలాల్ పేట మెట్ల బావి వద్ద మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ గారితో కలిసి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. pic.twitter.com/HTKPTOAXfG
— Talasani Srinivas Yadav (@YadavTalasani) December 2, 2022
చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతోనే మెట్ల బావి పునరుద్దరణ జరుగుతుందని వివరించారు. గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్లబావి పరిసరాలను తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తెలంగాణ ఇప్పటి వరకూ ఐటీ , ఫార్మా రంగాల్లో అభివృద్ధి సాధించిందని అందరికీ తెలుసు. సేవలు.. తయారీ రంగంలో మేడిన్ హైదరబాద్ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వెళ్తుంటాయి. కానీ.. హైదరాబాద్ నుంచి ఐస్‌క్రీమ్‌లు ఎగుమతి అవుతాయని మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకూ అలాంటి భారీ పరిశ్రమ రాలేదు. కొన్ని లోకల్ కంపెనీలు.. మరికొన్ని దిగుమతులు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణ నుంచి ఐస్‌క్రీములు ఎగుమతి చేయనున్నారు. ఎందుకంటే.. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ జహీరాబాద్‌లో ప్రారంభమయింది.
నాలుగు వందల కోట్ల పెట్టుబడితో యూనిట్ పెట్టిన హట్సన్ గ్రూప్
హట్సన్ కంపెనీకి చెందిన అరుణ్ బ్రాండ్ ఐస్ క్రీములు తయారు చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఉత్పత్తి ప్రారంభించింది. హట్సన్ కంపెనీ ద్వారా రోజుకు 7 టన్నుల చాకోలెట్స్, 100 టన్నుల ఐస్‌క్రీంను ప్రాసెస్ చేసే ప్లాంట్ల ప్రారంభోత్సవం జరిగింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తెలిపి సంతోషం వ్యక్తం చేశారు. ఇండియాలో ఐస్ క్రీమ్స్ కు పుట్టినిల్లుగా జహీరాబాద్ నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ యూనిట్ లో ప్రసిద్ధి గాంచిన అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జహీరాబాద్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక పాల వ్యాపారుల నుంచి పాల సేకరణ - నిరుద్యోగులకు ఉపాధి
ఈ ప్లాంట్ కోసం నాలుగు వందల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడులతో తెలంగాణలో శ్వేత విప్లవం వస్తుందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హట్సన్ సంస్థ స్థానికత రైతులకూ మేలు చేస్తుందన్నారు. ప్రతి రోజు 10 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తుందని, దీని వల్ల 5 వేల మంది పాడి రైతులు లాభం పొందుతున్నారని తెలిపారు. 1500 మందికి ఉపాధి కూడా లభిస్తుందని కేటీఆర్ చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)