(Source: ECI/ABP News/ABP Majha)
Ponnam on polio: తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం-హైదరాబాద్‌లో 2,800 కేంద్రాలు
ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీ UPHCలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
Minister Ponnam Prabhakar on polio: పోలియో వ్యాధి నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే... పల్స్ పోలియో (pulse polio) కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ఆంధ్రప్రేదశ్ (Andrapradesh) లో 37వేల 921, తెలంగాణ (Telangana)లో 22వేల 445 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా మొబైల్ పాయింట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఇక... హైదరాబాద్‌లో 2వేల 800 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. చింతల్‌బస్తీలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. పిల్లలకి పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దూరిశెట్టి, డీఎంహెచ్‌వో ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజల సహకారంతో భారత ప్రభుత్వం 27వ సారి పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister ponnam Prabhakar). ప్రజల సహకారం లేకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాదని చెప్పారాయన. భారత దేశం... పోలియో రహిత దేశంగా మారిందంటే... నిరంతర కార్యక్రమం వల్లే అని అన్నారు. హైదరాబాద్‌లో 2007 తర్వాత ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. అలాగే... దేశంలోనూ 2011 తర్వాత ఒక పోలియో కేసు కూడా రాలేదని చెప్పారు. 2012లో భారత దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడిందని గుర్తుచేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ (Hyderabad) నగరంలో 2వేల 800 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని... బస్టాండ్లు, ఆస్పత్రులు, 85 ట్రాన్సిట్ పాయింట్లు, 123 మొబైల్ బృందాల ద్వారా నగరంలో పల్స్ పోలియో కార్యక్రమం నడుస్తోందని చెప్పారు. ఐదేళ్ల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎవరైనా... ఇవాళ వేయించలేకపోతే... పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా.... రేపటి నుంచి రెండు రోజుల పాటు 11వేల మంది సిబ్బంది హైదరాబాద్‌లో ఇంటింటికీ తిరుగుతారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. అప్పుడైనా... కచ్చితంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
ఇక.. .ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఒక విజ్ఞప్తి చేశారు. సరోజినీ, నిలోఫర్, MNJ ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని కోరారు. త్వరలోనే ఆ ఆస్పత్రులను సందర్శిస్తానని హామీ ఇచ్చారు పొన్నం. సమస్యలు తెలుసుకుని పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం (congress government)... వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు పొన్నం ప్రభాకర్. అన్నింటికంటే ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారాయన. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిచంఆరు. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. పోలియో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రోగనిరోధక శక్తి పెంచడమే ప్రధాన మార్గం. అందుకోసమే ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేయిస్తే.. వైరస్‌కు వ్యతిరేకంగా రక్షణ ఇచ్చినట్లే అని చెప్తోంది. అందరూ స్పందించి... ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి.