KTR: స్పర్శ్ హాస్పిస్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ప్రత్యేకతలు ఏంటంటే..
ఖాజాగూడ వద్ద ఎకరం స్థలం విస్తీర్ణంలో స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని నిర్మించారు. ఈ స్థలాన్ని 33 ఏళ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది.
క్యాన్సర్ పేషెంట్ల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన ‘స్పర్శ్ హాస్పిస్’ భవనాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఆత్మ సంతృప్తి అనేది చాలా కొన్ని సందర్భాల్లోనే జరుగుతుందని అలాంటి ఫీలింగ్ ఇప్పుడు జరిగిందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. గతంలోనూ 2016లో బంజారాహిల్స్‌లోని హాస్పిస్ సెంటర్‌ను సందర్శించానని అన్నారు. ఇలాంటిది చాలా అరుదైన సాయమని కేటీఆర్ అన్నారు. సంయమనం, ఔదార్యం, సంస్కారం మూడూ ఉన్నవాళ్లు సాయం అందిస్తే బావుంటుందని నిర్వహకులు గతంలో అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం స్థలం కేటాయించిందని, ఐదేళ్లలోపే చక్కని భవనం ఏర్పాటు చేయడం సంతోషమని కేటీఆర్ అన్నారు.
ఖాజాగూడ వద్ద ఎకరం స్థలం విస్తీర్ణంలో స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని నిర్మించారు. ఈ స్థలాన్ని 33 ఏళ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 బెడ్స్ ఇందులో ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా మరో 10 పడకలు ఏర్పాటు చేశారు. ఈ దవాఖానకు ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. చనిపోయే స్థితిలో ఉన్న వేలాది మంది క్యాన్సర్ రోగులకు స్పర్శ్ హాస్పిస్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంటారు.
క్యాన్సర్ రోగులకు చివరి రోజుల్లో ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్ హాస్పిస్’ ఉచిత వైద్య సేవలు అందిస్తుంది. పలకరింపులకు దూరంగా అయిన వారికి భారంగా అంతిమ ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ఉచితసేవలు అందిస్తోంది ఇంతకాలం ఈ స్పర్శ్.. రోటరీ క్లబ్ బంజారాహిల్స్ సారథ్యంలో ఇక్కడ రోడ్ నం.12 లో ఉన్న ఓ అద్దె బిల్డింగ్‌లో ఉండేది. కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఖాజాగూడలో కొత్తగా ఒక భవనాన్ని నిర్మించారు. దీనినే మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
‘స్పర్శ్ హాస్పిస్’ను తొలుత రోటరీ క్లబ్ సారథ్యంలో బంజారా హిల్స్ రోడ్ నం.12 లోని అద్దెభవనంలో చాలా రోజులు కొనసాగా.. ప్రస్తుతం నానక్‌రామ్ గూడ మార్గంలోని ఖాజాగూడ వద్ద ఉన్న శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన కొత్తగా నిర్మించిన సొంత భవనంలోనికి మార్చారు. మనిషి పుట్టుక నుంచి పెరిగేంత వరకూ ఎంత గొప్పగా జీవించాడో మరణించే మరణించాక కూడా అంతే గౌరవాన్ని అందించాలనే సంకల్పంతో తాము ఉచిత సేవలు అందిస్తున్నామని స్పర్శ్ హాస్పిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎర్రపోతు రామ్ మోహన్‌రావు తెలిపారు.
Live: Minister @KTRTRS speaking after formally inaugurating Sparsh Hospice facility in Hyderabad https://t.co/tT6r5mU7th
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 4, 2021