యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలి- బండి సంజయ్ ప్రమాణంపై కేటీఆర్ ఘాటు రిప్లై
ప్రమాణాలతో సమస్యలు పరిష్కరమవుతాయనుకుంటే దేశంలో కోర్టులు, పోలీసు స్టేషన్‌లు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్.
బాధ్యతగల వ్యక్తులు కొన్ని విషయాలపై మాట్లాడకపోవడం ఉత్తమం అన్నారు మంత్రి కేటీఆర్. కేటీఆర్ కామెంట్స్. తాము అధికారంలో ఉన్నందున ఏం మాట్లాడినా దర్యాప్తుపై ప్రభావం అవుతుందని విమర్శిస్తారని... అందుకే మాట్లాడబోమన్నారు. ఈ వ్యవహారంలో సమయానుకూలంగా పార్టీ అధిష్ఠానం స్పందిస్తుందన్నారు.
కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్టు మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంత కంటే ఎక్కువ మాట్లాడితే బాగోదన్నారు.
Live: TRS Working President, Minister Sri @KTRTRS addressing the Media at Telangana Bhavan https://t.co/KQ4Xa0HHyy
— TRS Party (@trspartyonline) October 29, 2022
ప్రమాణాలతో సమస్యలు పరిష్కరమవుతాయనుకుంటే దేశంలో కోర్టులు, పోలీసు స్టేషన్‌లు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. రేపిస్టులకు ఘన స్వాగతం పలిగిన బీజేపీ వాళ్ల ప్రమాణాలకు అసలు విలువ ఎక్కడ ఉందన్నారు. ఇలాంటి ప్రమాణాలు విమానాలతో నిజాలు మరుగన పడిపోవని అభిప్రాయపడ్డారు.
అసలు బండి సంజయ్ ప్రమాణంతో యాదాద్రి అపవిత్రమైందని కామెంట్ చేశారు. గుజరాత్ గులాముల చెప్పుల మోసిన చేతులతో ప్రమాణం చేశారని ఎద్దేవా చేశారు. అలాంటి ప్రమాణాలకు అసలు విలువే లేదన్నారు. అపవిత్రమైన యాదాద్రిని సంప్రోక్షణ చేయాలని అధికారులకు సూచించారు కేటీఆర్.