By: ABP Desam | Updated at : 17 Feb 2023 03:40 PM (IST)
Edited By: jyothi
చెప్పేవి ఎలాగూ అబద్ధాలే, కనీసం అంతా కలిసి ఒకటే చెప్పండి: మంత్రి కేటీఆర్
KTR On Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు మెడికల్ కళాశాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆమెకు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తమ కేంద్ర మంత్రులు సరైన శిక్షణ ఇవ్వడం లేదంటూ ట్విట్టర్ వేదికగా ఎధ్దేవా చేశారు. ఎలాగూ అబద్ధాలే చెబుతున్నారు.. కనీసం అందరూ కలిసి ఒకే అబద్ధం చెప్పేలా ట్రైనింగ్ ఇవ్వండంటూ మోడీకి సూచించారు.
3 Union Cabinet Ministers on Medical colleges in #Telangana state👇@kishanreddybjp - 9 sanctioned @mansukhmandviya - 0 proposals received@nsitharaman - 2 proposals received
— KTR (@KTRBRS) February 17, 2023
Modi Ji, train your ministers well at least to consistently peddle the same Lies & Fakery pic.twitter.com/3F51MuO3JR
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన నిర్మలా సీతారామన్
ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రమే భారీగా అప్పులు చేస్తోందని, బీజేపీలో అసమర్థ పాలకులు ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. కేంద్రప్రభుత్వం తెలంగాణకు చాలా అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేసీఆర్ కు అదే స్థాయిలో కొంటర్ ఇచ్చారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇవ్వలేదంటూ కేసీఆర్ చేసిన విమర్శలను కూడా ఖండించారు. అసలు మెడికల్ కాలేజీల ప్రతిపాదనలు సరిగ్గా రాలేదన్నారు. మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలకే మళ్లీ ప్రతిపాదనలు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదా? అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్రం నుంచి డేటా సరిగా ఇవ్వలేదు. నోడేటా అనేది ఎవరికి వర్తిస్తుందో ఆలోచించండి అంటూ సెటైర్లు వేశారు. మాపై విమర్శలు చేస్తున్నారు.. మీ సంగతేంటీ అని ప్రశ్నించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని గుర్తు చేశారు.
Gem among these Union Cabinet has to be our own Kishan Reddy Garu 👍
— KTR (@KTRBRS) February 17, 2023
He announces creation of 9 Non-Existent Medical colleges in Telangana out of thin air and also a Fictitious Global Centre of Traditional Medicine in Hyderabad 😂 pic.twitter.com/fpAYlub447
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణకు తొమ్మిది కళాశాలలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని... అసలు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని మాన్సుక్ మాండవీయ అంటున్నారని ట్వీట్ చేశారు. మరోవైపు రెండు ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని నిర్మలా సీతారామన్ అంటున్నారని మంత్రి కేటీఆర్ వివరించారు. ముగ్గురూ మనిషికో మాట చెబుతున్నారని.. చెప్పేవెలాగు అబద్ధాలే అయినప్పుడు కనీసం అంతా కలిసి ఒకటే చెప్పండంటూ సూచించారు.
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది