By: ABP Desam | Updated at : 28 Mar 2023 02:39 PM (IST)
Edited By: jyothi
ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు - ఆలోచన అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ ట్వట్
Playground Under flyover: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా ఆయనకు ట్వీట్ చేసిన వెంటనే స్పందించి సాయం చేస్తుంటారు కేటీఆర్. ఎవరు ఏం చెప్పినా దాని గురించి ఆలోచిస్తారు. అయితే తాజాగా ధనుంజయ్ అనే ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అన్ని పట్టణాల్లోని ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు తీర్చిదిద్దితే ఆటలు ఆడుకునేందుకు వెసులు బాటు ఉంటుందని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆలోచన అదిరిందంటూ కామెంట్ చేశాడు. ఇది మంచి ఆలోచన అని.. ఈ విధానాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ కు సూచించారు.
Let’s get this done in a few places in Hyderabad @arvindkumar_ias
— KTR (@KTRBRS) March 27, 2023
Looks like a nice idea https://t.co/o0CVTaYxqb
జంట నగరాల్లో ఈ తరహా క్రీడా వేధికలను అందుబాటులోకి తీసుకు వస్తే బాగుటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ఇది నిందగానే అద్భుతమైన ఆలోచన. నవీ ముంబైలో ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలను నిర్మించినట్లు అన్ని పట్టణాల్లోని ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీ పట్టణాల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నా అని నెటిజెన్ ప్రశ్నించారు. అయితే మంత్రి కేటీఆర్ దీనికి రిప్లై ఇవ్వడంతో.. చాలా మంది నెటిజెన్లు మంత్రిని సపోర్ట్ చేస్తున్నారు. నిజంగానే ఇది చాలా మంచి ఐడియా అంటూ ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్ లోనూ దీన్ని అమల్లోకి తెస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!
హెచ్‌సీయూలో ఎంటెక్ కోర్సు, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు!
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్
TSLPRB Result: పోలీసు అభ్యర్థుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు వెల్లడి!
Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్‌లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్ వేడుక
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం
Lust Stories 2 Teaser : పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్ వెబ్ సిరీస్ టీజర్!
WTC Final 2023: మాకా.. నాకౌట్ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్ రెస్పాన్స్ ఇదీ!
ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?