అన్వేషించండి

Damodar Raja Narasimha: ఆస్పత్రుల్లో టాస్క్ ఫోర్స్ కమిటీలు నిత్యం తనిఖీలు చేయాలి: మంత్రి దామోదర

Medical And Health Department : ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిత్యం తనిఖీలు జరపాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా సంబంధిత అధికారులను ఆదేశించారు. నెలకు రెండుసార్లు విజిట్ చేయాలన్నారు.

Damodar Raja Narasimha:  వైద్యో నారాయణ హరి.. అంటూ వైద్యులను పూర్వకాలం నుంచి దైవంగా భావిస్తారు. ఇలాంటి డాక్టర్లు తమ వృత్తి ధర్మాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు కూడా ఇలాగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు 12గంటలకే విధులకు డుమ్మా కొడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే ఫోన్ చేయాలని పీజీ వైద్యులకు చెబుతూ ఆస్పత్రి నుంచి వెళ్లిపోతున్నారు. ఎవరైనా అధికారులు వస్తున్నట్లు తెలిస్తే వెంటనే వచ్చి విధుల్లో ఉన్నట్లు నటిస్తున్నారు. ఇక్కడికి వచ్చే రోగులతో మెరుగైన వైద్యం కావాలంటే ప్రైవేటుకు వెళ్లాలంటూ సొంత ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు.  డాక్టర్లు బయట ఆస్పత్రుల్లో పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పనిచేస్తున్నా.. అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీలను నియమించింది. ఆ కమిటీల విధుల గురించి మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

నిత్యం తనిఖీలు చేయాల్సిందే
ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిత్యం తనిఖీలు జరపాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా సంబంధిత అధికారులను ఆదేశించారు. తనిఖీల వివరాలను ప్రతి నెలా తనకు నివేదిక రూపంలో అందించాలని సూచించారు.  ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.  ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల హెచ్‌వోడీలు నెలకు కనీసం రెండుసార్లు జిల్లాల్లోని హాస్పిటల్స్‌ను విజిట్ చేయాలని మంత్రి సూచించారు.  హాస్పిటల్ హెచ్‌ఆర్, అటెండెన్స్‌, ఎక్విప్‌మెంట్, మెడిసిన్, సానిటేషన్, డైట్ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.  ఈ మేరకు మంత్రి శనివారం సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని హాస్పిటళ్లలో అవసరమైన మెడిసిన్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

వారి ఆరోగ్యంపై ఫోకస్ చేయాలి
ట్రైబల్ ఏరియాల్లోని గర్భిణుల ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈడీడీ (ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్‌) వివరాలతో ఓ క్యాలెండర్ మెయింటేయిన్ చేయాలని, ట్రైబల్ ఏరియాల్లో ఉన్న గర్భిణులను ఈడీడీ కంటే వారం రోజుల ముందే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి, వారికి బర్త్ వెయిటింగ్‌ రూమ్స్‌ను అలాట్ చేయాలని సూచించారు. ఐటీడీఏల పరిధిలో ఉన్న హాస్పిటళ్ల అభివృద్ధిపై ఎక్కువగా ఫోకస్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయా హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసి తనకు ఇవ్వాలని అధికారులకు సూచించారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, టాస్క్‌ఫోర్స్ కమిటీలపై ప్రతి నెలా రివ్యూ చేస్తానని, అన్ని వివరాలతో రివ్యూకు అటెండ్ కావాలని అధికారులకు మంత్రి సూచించారు. అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో బయోమెట్రిక్ అటెండెన్స్‌ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Embed widget