News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nandhikanti Sridhar Quits Congress: మైనంపల్లితో టికెట్ వార్ - కాంగ్రెస్ పార్టీకి నందికంటి శ్రీధర్ రాజీనామా

Nandhikanti Sridhar resigns to congress party: మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

Nandhikanti Sridhar resigns to congress party:

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా నేతలు పార్టీలు మారుతున్నారు. టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలతో పాటు తమ శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదంటూ నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అంతకుముందు మౌలాలి క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది పైగా ముఖ్య కార్యకర్తలతో రహస్యభేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని తల్లిలా భావించానని, కానీ ఆ తల్లే నన్ను మోసం చేసిందంటూ నందికంటి శ్రీధర్ కంటతడి పెట్టారని సన్నిహిత వర్గాల సమాచారం.

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడితో పాటు ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ తొలి జాబితాలో మైనంపల్లికి టికెట్ వచ్చినా, మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ రాని కారణంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. అయితే పార్టీనే నమ్ముకుని 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఖర్గేకు రాసిన లేఖలో నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి సీటు ఆశించానని, అయితే పొత్తుల కారణంగా సీటు రాలేదని లేఖలో ప్రస్తావించారు.

గత నెల 28న మైనంపల్లి హన్మంతరావు, తన కుమారుడితో పాటు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడికి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. మరోవైపు మెదక్ టికెట్ మైనంపల్లి తనయుడు రోహిత్ కు ఇస్తున్నారని ఇదివరకే మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ టికెట్ తిరుపతి రెడ్డి ఆశించారు. కానీ బీఆర్ఎస్ లో ఆ సీటు తన కుమారుడికి ఇవ్వలేదన్న కారణంగానే మైనంపల్లి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. దాంతో తన ఆశలు గల్లంతు కావడంతో నిరాశ చెందిన తిరుపతి రెడ్డి హస్తం పార్టీని వీడారు. ఈ క్రమంలో మల్కాజిగిరిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. గత ఎన్నికల్లో దక్కని మల్కాజిగిరి టికెట్ ఈసారి వస్తుందని ఆశించిన నందికంటి శ్రీధర్.. మైనంపల్లి హన్మంతరావు పార్టీలో చేరికతో అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ తనకు దక్కడం లేదన్న బాధతో ఆయన సోమవారం పార్టీకి రాజీనామా చేసి లేఖను ఖర్గేకు పంపారు. 

రాజీనామా లేఖలో ఏముందంటే..
‘బీసీ కమ్యూనిటీకి చెందిన తాను (నందికంటి శ్రీధర్) 1994 నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను. ఇతర నేతల్లా కాకుండా పార్టీలు మారకుండా కాంగ్రెస్ కు విధేయుడిగా ఉంటూ, ఎంతో సేవ చేశాను. 2018లో టికెట్ వస్తుందని భావించా. కానీ పొత్తుల కారణంగా టికెట్ రాలేదు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం కుటుంబానికి ఒకే సీటు నిర్ణయాన్ని స్వాగతించి.. ఈ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని భావించాను. కానీ ఇప్పుడు మల్కాజిగిరి మెదక్ టికెట్లను ఒకే కుటుంబానికి కేటాయించారు. ఎన్నో ఏళ్ల నుంచి మల్కాజిగిరికి చెందిన పార్టీ నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పోరాడారు. వారిపై అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గలేదు. నేడు అదే నేతను పార్టీలో చేర్చుకుని మాకు అన్యాయం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇద్దరికి టికెట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఓసీ అభ్యర్థికి సీటు ప్రకటించి, బీసీ అభ్యర్థులకు అన్యాయం చేసిన కారణంగా డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని నందికంటి శ్రీధర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Published at : 02 Oct 2023 07:10 PM (IST) Tags: CONGRESS Malkajgiri Telangana elections 2023 Mynampally Hanumanth Rao Nandhikanti Sridhar

ఇవి కూడా చూడండి

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

టాప్ స్టోరీస్

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది

MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది