News
News
X

Heart Attacks :యువతకు గుండెపోటు - తక్షణం స్పందించేందుకు కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా ?

గుండెపోటుకు గురైన యువతను రక్షించేందుకు కేటీఆర్ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. అత్యవసర చికిత్స అందించే పరికరాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

FOLLOW US: 
Share:

Heart Attacks :   ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు ప్రమాదం ఎక్కువ అయింది. చివరికి క్లాసు రూముల్లోనూ కొంత మంది గుండెపోటుకు గురవుతున్నారు. కారణాలేమిటనే దాని సంగతిని పక్కన పెడితే ముందు గుండెపోటుకు గురయిన వాళ్లకు తక్షణ ప్రాథమిక చికిత్స చేయిస్తే కొంతయినా ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ఇటీవల ఆసక్తి ఉన్న వారందరికీ సీపీఆర్ ట్రైనింగ్ ఇప్పిస్తోంది. సీపీఆర్ అంట ే కార్డియోపల్మనరీ రిససిటేషన్‌ )లో లక్షమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. 

ఆటోమెటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌   పరికరాలతో  తక్షణ చికిత్స అందించే అవకాశం                   

 అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినవారికి అపర సంజీవనిలా పనిచేసే ఆటోమెటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌  పరికరాలను తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పబ్లిక్‌ ప్లేస్‌లలో ఏర్పాటుచేసేందుకు 1400 పరికరాలకు ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చినట్టు  కేటీఆర్‌ ప్రకటించారు. ప్రాణాంతకంగా పరిణమించిన గుండెపోటు బాధితులకు ఆటోమెటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ (ఏఈడీ) అపర సంజీవనిగా నిలుస్తుంది. ఈ పరికరం దవాఖానకు వెళ్లేలోపు అత్యవసర చికిత్సను అందించి ఆయువును పెంచుతుంది. 

ప్రపంచ స్థాయి నగరాల్లో ప్రజలకు అందుబాటులో ఆటోమెటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌  పరికరాలు             

ప్రపంచస్థాయి నగరాల్లో ఇప్పటికే పబ్లిక్‌ యాక్సెస్‌ డీఫీబ్రిలేటర్లు గుండెపోటు బాధితులకు ఊపిరిపోస్తున్నాయి. అక్కడలాగే  మాదిరిగా హైదరాబాద్‌లోనూ పబ్లిక్‌ యాక్సెస్‌ డీఫిబ్రిలేటర్లను ఏర్పాటుచేయాలని ట్విట్టర్‌ లో కేటీఆర్‌కు సూచనలు అందాయి.దీంతో  మొదటి విడతలో 1400 డీఫిబ్రిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చినట్టు ప్రకటించారు. వీటిని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలవంటి బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులోకి తేనున్నారు. ఈ డీఫిబ్రిలేటర్‌ను ఎవరైనా ఉపయోగించవచ్చు. శిక్షణ అవసరం కూడా లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు.                     
 
పబ్లిక్ ప్లేసుల్లో పెట్టిన తర్వాత ఎలా చికిత్స చేయాలో అవగాహన కల్పించే అవకాశం                                                

ఎవరైనా గుండెపోటుకు గురైనట్టు గుర్తిస్తే వెంటనే   డీఫిబ్రిలేటర్‌ పరికరం ఉన్న సమీప ప్రాంతాన్ని గుర్తించాలి. దీని కోసం 999 ఫోన్ నెంబర్ పని చేస్తుంది. గ్రీన్‌ బటన్‌ నొక్కి డీఫిబ్రిలేటర్‌ను ఆన్‌ చేశాక.. ఆ పరికరం వాయిస్‌ రూపంలో ఇచ్చే సూచనలను అనుసరించాలి.నడీఫిబ్రిలేటర్‌  స్టిక్కీ ప్యాడ్‌లను రోగి ఛాతిపై అమర్చాలి. పరికరం రోగి గుండె లయను పరీక్షించి షాక్‌ అవసరమా? లేదా! అన్నది నిర్ణయిస్తుంది. షాక్‌ అవసరమైతే..షాక్‌ బటన్‌ నొక్కాలని చెప్తుంది.షాక్‌ ప్రక్రియ పూర్తయ్యాక సీపీఆర్‌ కొనసాగించాలా? వద్దా? అన్నది కూడా డీఫిబ్రిలేటర్‌ తెలియజేస్తుంది. గుండె లయకు సంబంధించిన సంకేతాలను చూపించే వరకు.. ఆపరేటింగ్‌ను ఆపివేయాలని డీఫిబ్రిలేటర్‌ చెప్పేవరకూ ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఈ అత్యవసర చికిత్సతో ప్రాణాపాయం నుంచి రోగిని రక్షించవచ్చని నిపుణులుచెబుతున్నారు.  

Published at : 03 Mar 2023 07:07 PM (IST) Tags: KCR heart attack deaths immediate treatment for heart attacks

సంబంధిత కథనాలు

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!

Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

CM KCRకు బండి సంజయ్ లేఖ-  విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!