అన్వేషించండి

Khairatabad Ganesh: అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

Khairatabad Vinayaka: ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో భక్తులు పోటెత్తారు. గంట గంటకూ అక్కడ భక్తుల సంఖ్య పెరుగుతోంది.

గణేష్ నవరాత్రులు ముగుస్తున్న సందర్భంలో హైదరాబాద్ కోలాహలంగా మారింది. గణేష్ మండపాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద ఈ సందడి మరింత ఎక్కువైంది. వరుస సెలవలు రావడంతో భక్తులు ఖైరతాబాద్ కి పోటెత్తారు. ఖైరతాబాద్ గణేష్ మండపం భక్త జన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు పోటెత్తారు. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

అర్థరాత్రి వరకే అనుమతి..
హైదరాబాద్ లో మంగళవారం నిమజ్జనోత్సవం జరుగుతుంది. నిమజ్జనోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. హుస్సేన్ సాగర్ వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం కోసం ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రేపు(సోమవారం) అంతా అక్కడ శోభాయాత్ర కోలాహలం ఉంటుంది. అందుకే రేపు దర్శనాలకు అవకాశం లేదు. ఈరోజు అర్థరాత్రి వరకే దర్శనాలకు అనుమతి ఉందని నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో భక్తులు ఖైరతాబాద్ కి పోటెత్తారు. 

Khairatabad Ganesh: అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకోసం ఇప్పటికే ట్రాలీలు తీసుకొచ్చి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. అందుకే దర్శనాలను ఈరోజు అర్థరాత్రి వరకే పరిమితం చేశారు. ఈరోజు అర్థరాత్రి తర్వాత ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఉండదని, శోభాయాత్రకు ఏర్పాట్లు జరుగుతుంటాయని, భక్తులెవరూ ఆ సమయంలో రావొద్దని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో భక్తులు పోటెత్తారు. గంట గంటకూ అక్కడ భక్తుల సంఖ్య పెరుగుతోంది. 

అసలే వారాంతం, అందులోనూ ఆదివారం సాయంత్రం. హైదరాబాద్ నగరంలో మామూలుగానే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పైగా గణేష్ నవరాత్రులు చివరికి చేరడంతో ఆ ట్రాఫిక్ మరింత పెరిగింది. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి ఈరోజు అర్థరాత్రి వరకు అవకాశం అని నిర్వాహకులు ప్రకటించడంతో ఆ ప్రాంతం మరింత రద్దీగా మారింది. పైగా వర్షం కూడా ఈ ట్రాఫిక్ ని మరింత పెంచింది. ఖైరతాబాద్ రోడ్ పై విపరీతమైన ట్రాఫిక్ ఉంది. మెట్రో స్టేషన్ కూడా రద్దీగా మారింది. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి పార్కింగ్ సమస్య ఉంటుంది. అందుకే చాలామంది బస్ లు, మెట్రోలో ఇక్కడికి వస్తున్నారు. 

Also Read: గణేష్ నిమజ్జనం - నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్, ఆ రోజున అర్ధరాత్రి వరకూ సర్వీసులు

అటు ఐమ్యాక్స్ థియేటర్ వైపు నుంచి కూడా భారీగా జనం తరలి వస్తున్నారు. ఇటు లక్డీకపూల్ - పంజాగుట్ట రోడ్ వైపునుంచి జనం భారీగా తరలి వస్తున్నారు. అటు ఐమ్యాక్స్‌ థియేటర్ వైపు నుంచి కూడా జనం దర్శనాల కోసం క్యూ కట్టారు. బ్యారికేడ్లు కూడా తొలగించుకుని భక్తులు దర్శనాలకోసం వస్తున్నారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కూడా సాధ్యం కావడంలేదు. నిర్వాహకులు వాలంటీర్లు భక్తుల్ని కంట్రోల్ చేస్తున్నారు క్యూలైన్లలో ఉన్నవారిలో వృద్ధులు, చిన్నారులతో వచ్చిన మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షంలో తడుస్తూనే ఖైరతాబాద్ గణపతి దర్శనం చేసుకుని బయలుదేరుతున్నారు. 

Also Read: Asifabad News: బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అరెస్ట్ - పోలీసులపై నేతల ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget