By: ABP Desam | Updated at : 21 Dec 2022 11:14 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మద్యం దందాలో కవిత పేరు ఉందంటూ బీజేపీ లీడర్ రాజగోపాల్ చేసిన కామెంట్స్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. తొందరపడి మాట జారొద్దని సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్దం నిజం అయిపోదని అభిప్రాయపడ్డారు.
తాజాగా కోర్టుకు ఈడీ సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు ప్రస్తావించారు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలకు పదను పెట్టాయి. ఇందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొన్ని పత్రికల వార్తలను ట్వీట్ చేస్తూ కవిత పేరు ప్రస్తావించకుండానే లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారని విమర్శించారు.
రాజ్‌గోపాల్‌రెడ్డి ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన కవిత... తొందరపడొద్దని మాట జారొద్దని సూచించారు. 28 సార్లు కాదు 28వేల సార్లు తన పేరు చెప్పినా అబద్దం నిజమైపోదని కామెంట్ చేశారు.
రాజగోపాల్ అన్న ..
తొందరపడకు , మాట జారకు !!
" 28 సార్లు " నా పేరు చెప్పించినా
" 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా
అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail https://t.co/476lW6fOTC— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022
నా సిన్సియారిటీని కాలమే రుజువు చేస్తుంది: కవిత
మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్‌కి కూడా కవిత రియాక్ట్ అయ్యారు. తనపై మోపిన అభియోగాలన్నీ బోగస్ అని కొట్టిపారేశారు. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదంతా బీజేపీ రాజకీయ ఆటలో భాగమని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్‌ను ఆపడానికే ఇదంతా చేస్తున్నారన్నారు. రైతు వ్యతిరేకంగా, కార్పొరేట్‌కు బీజేపీ చేపడుతున్న తీసుకుంటున్న విధానాలు ప్రజల ముందు ఉంచుతున్నారనే కక్షతోనే ఇదంతా సాగుతున్నారు.
.@manickamtagore Ji
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022
The accusations on me are completely bogus and false. Only time will prove my sincerity.
It’s a political vendetta of BJP, as they fear BRS Party Chief CM KCR ji’s expose on their anti-farmer & pro-capitalist policies. https://t.co/JygENzO2hp
ఈడీ ఛార్జిషీట్‌లో ఏముందంటే?
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ వేసిన మరో ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు ప్రస్తావించింది. సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవితతోపాటు, వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పాత్రను వివరించింది. ఈ కేసులో బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు ఈడీ కోర్టుకు వివరించింది.
ఇండోస్పిరిట్స్ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్‌రెడ్డి, కవిత అని తెలిపింది ఈడీ. ఇండో స్పిరిట్స్‌కు ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ అభియోగం మోపింది. ఇండో స్పిరిట్‌లో రామచంద్ర పిళ్‌లై వెనుక ఉన్నది కవిత అని ఈడీ తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తరఫున ప్రేమ్ రాహుల్ పనిచేస్తున్నారని వివరించింది. ఈ సంస్థ 14,05,58,890 సీసాల మద్యం విక్రయించి రూ.192.8 కోట్లు సంపాదించిందని పేర్కొంది.
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, కె.కవిత, శరత్‌రెడ్డి నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులను విజయ్‌నాయర్‌కు ఇచ్చిందని ఆరోపించింది. ఆప్ నేతల మధ్య కుదిరిన డీల్‌గా వెల్లడించింది. దీని ప్రకారం వంద కోట్లను ముందస్తుగా చెల్లించినట్టు పేర్కొంది వివరించింది. ఈ వంద కోట్లు వసూలకు వీలుగా ఇండోస్పిరిట్‌లో 65 శాతం వాటాను సౌత్‌గ్రూప్‌నకు ఇచ్చింది. ఈ వాటాను అరుణ్‌పిళ్లై, ప్రేమ్‌రాహుల్ అనే బినామీ ప్రతినిధులతో నడిపించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో పాత్ర ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు. ఇందులో కవిత ఫోన్లు పది ధ్వంసమైనట్టు పేర్కొంది.
అరుణ్‌పిళ్‌లై రూ.3.4 కోట్లు పెట్టుబడి పెట్టి 65శాతం లాభంతో రూ.32.26 కోట్లు వచ్చినట్లు ఈడీ వివరించింది. ప్రేమ్ రాహుల్ రూ.5 కోట్లు పెట్టినా ఎలాంటి లాభం చూపించలేదని తెలిపిరంది. ఈయన్ని డమ్మీగా చూపించి 65 శాతం వాటాను అరుణ్ పిళ్‌లై తీసుకున్నారని ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ తరఫున సమీర్ మహేంద్రు 35శాతం వాటాగా రూ.5 కోట్ల పెట్టుబడితో 35శాతం లాభం పొందారని తెలిపింది. వీరిపై మనీలాండరింగ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది.
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!
హెచ్‌సీయూలో ఎంటెక్ కోర్సు, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు!
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్
TSLPRB Result: పోలీసు అభ్యర్థుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు వెల్లడి!
Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్ వేడుక
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం
RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్బీఐ సమీక్ష, రెపో రేట్ ఎంత పెరగొచ్చు?
WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్ ఎందులో? టైమింగ్, వెన్యూ ఏంటి?
Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్ ప్రైస్‌లో స్మార్ట్ రియాక్షన్