అన్వేషించండి

Kavitha ED Enquiry: ఎమ్మెల్సీ కవిత ఫోన్లను పరిశీలిస్తున్న ఈడీ అధికారులు - అడ్వకేట్ భరత్ సమక్షంలోనే!

Kavitha ED Enquiry: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు వాటిని ఈరోజు పరిశీలించబోతున్నారు. అడ్వకేట్ భరత్ ఆధ్వర్యంలో ఫోన్లలో ఉన్న డేటాను సేకరిస్తున్నారు.

Kavitha ED Enquiry: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే ఈడీ అధికారులు పలుమార్లు విచారించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఆమె వాడిన తొమ్మిది ఫోన్లను ఆమె ఈడీ అధికారులకు అప్పగించారు. వారికి అప్పగించే కంటే ముందు కవర్లలో వేసి ఉన్న ఆ ఫోన్లను కవిత మీడియాకు కూడా చూపించారు. అయితే ఈరోజు ఆ ఫోన్లలో ఏముందో తెలుసుకునేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత లేదా ఆమె తరఫున ఎవరైన ఈడీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఇందులో భాగంగానే కవిత అడ్వకేట్ సోమ భరత్ రెండో రోజు కూడా ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఇదే కేసు విషయమై మంగళవారం ఈడీ ఆఫీసుకు వెళ్లిన ఈయన.. నేడు రెండోసారి వెళ్లారు. సోమ భరత్ సమక్షంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఫోన్లను చెక్ చేయబోతున్నారు. అందులో ఉన్న డేటాను అధికారులు సేకరిస్తున్నారు. 

ఇటీవలే అంటే మార్చి 21వ తేదీన మూడోసారి ఈడీ విచారణ కోసం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఆమె తన కారులో తండ్రి కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు తాను గతంలో వాడిన ఫోన్లను చూపించారు. రెండు కవర్లలో దాదాపు 10 ఫోన్లను మీడియాకు చూపించారు. ఈ కేసులో ఆధారాలు దొరక్కుండా తన ఫోన్లను కవిత ధ్వంసం చేశారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు వెళ్లే ముందు ఆ ఫోన్లు ప్రత్యేకంగా రెండు కవర్లలో వేసి చూపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ఫోన్లకు స్టిక్కర్లు కూడా అతికించి ఉన్నాయి. ఇంటి నుంచి బయలుదేరే ముందే కాకుండా, ఈడీ కార్యాలయానికి చేరుకున్నాక, లోనికి వెళ్లే ముందు కూడా ఆ ఫోన్లు ఉన్న కవర్లను మరోసారి కవిత పైకి ఎత్తి చూపించారు. 

ఆ తర్వాత ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. తాను ఫోన్లను ధ్వంసం చేశానని ఆరోపణ చేయడాన్ని కవిత  తీవ్రంగా తప్పుపట్టారు. ఈడీ అధికారులు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నారని, అందుకని తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని అన్నారు. అయినా ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అని కవిత ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ ఈడీ తాను ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొందని లేఖలో పేర్కొన్నారు. తనను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసిందని కవిత ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని కవిత వాపోయారు. తద్వారా తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును, తమ పార్టీ ప్రతిష్ఠను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget