అన్వేషించండి

TRS Kavitha : కీలక హామీలతో ఎన్నికల యుద్ధభేరీ మోగించిన టీఆర్‌ఎస్ చీఫ్ కవిత! ఏంటీ పాంచజన్యం? అందులో ఏం ఉన్నాయి?

TRS Kavitha : ప్రైవేటు స్కూల్‌లో ఉచిత విద్యతోపాటు చాలా హామీలతో ప్రజల పరీక్షలను ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్ చీఫ్ కవిత సిద్ధమయ్యారు. ఐదు కీలక హామీలతో పాంచజన్యం పూరించారు.

TRS Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ ప్రకటించిన కవిత తన లక్ష్యాలను స్పష్టంగా ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నామని వెల్లడించారు. దీని కోసం ప్రజల్లోకి వెళ్లేందుకు తాను ఐదు కీలక హామీలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో అందరికీ ఉచిత విద్యను అందిస్తామని కవిత సెన్సేషనల్ ప్రకటన చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఏ రోగానికైనా ఏ ఆసుపత్రి అయినా సరే ఉచితంగా వైద్యం అందిస్తామని ప్రకటించారు. రైతే రాజు అన్న నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఏ ఆఫీస్‌కు వెళ్లినా రైతు అని చెబితే ప్రత్యేక మర్యాదులు ఉంటాయని పేర్కొన్నారు. వారికి ప్రత్యేకంగా చూసి వారి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చట్టం తీసుకొస్తామని ప్రామిస్ చేశారు. 

ఉద్యోగాలా, వ్యాపారమా? యువతే నిర్ణయించుకునే వెసులుబాటు 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారే తప్ప మీ ఆలోచన ఏంటని ఎవరైనా అడిగారా అని కవిత ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో మాత్రం అలాంటి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఉద్యోగం చేయాలో, వ్యాపారం చేయాలో ఆ దిశగానే వారికి చేయూత అందిస్తామని వెల్లడించారు. వచ్చిన మొదటి ఏడాదే ఒకే దెబ్బతో నాలుగు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కేటాయించి వారికి ఇస్తామని ప్రకటించారు. వ్యాపారాలు చేసుకుంటామని మంచి ప్రతిపాదనలతో వచ్చిన యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రుణాలు ఇస్తుందని వెల్లడించారు. దీనికి ఎలాంటి ష్యూరిటీలు ఉండవి, ప్రభుత్వమే వారికి అండగా ఉంటుందన్నారు. 

పన్నెండేళ్లుగా తెలంగాణ పాలకు మరిచిపోయిన సామాజిక న్యాయ తెలంగాణ ధ్యేయంగా పని చేస్తామన్నారు కవిత. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణపేదలకు, ముస్లీంలు, క్రిస్టియన్లకు న్యాయంచేసేలా వారికి విద్య, వైద్యం, ఇల్లు ఇవ్వడంతోపాటు వారు అభివృద్ధి చెందేందుకు కావాల్సిన అన్ని వెసులుబాట్లు ప్రభుత్వం తరఫున అందిస్తామని మాట ఇచ్చారు. 

Also Read: కవిత టీఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్‌ కౌంటర్ అటాక్! పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్!

బీజేపీ నేతలకు సవాల్

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేసిన ముంపు ప్రాంతాల విషయంపై కూడా కొట్లాడతామన్నారు కవిత. అక్రమంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని వివరించారు. సత్తా ఉంటే ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేలా కేంద్రాన్ని ఒప్పించాలని బీజేపీ ఎంపీలకు సవాల్ చేశారు. అసలు తెలంగాణ ఏర్పాటే బీజేపీకి ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. "తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అంటారు. మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణను భారత్ పాక్ విభజనతో పోల్చుతారు. అగ్రనాయకత్వం అలా మాట్లాడితే బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట్లాడరు. మనకు ఒక్క రూపాయి ఇవ్వకపోయిన సరే మన బీజేపీ ఎంపీలు మాట్లాడరు. సామాజిక న్యాయం అనే దానికే బద్ద వ్యతిరేకి బీజేపీ. మహిళ బిల్లు పక్కన పెట్టారు. బీసీ బిల్లు, కులగణన బిల్లు తొక్కి పెట్టారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీని పక్కన పెట్టారు. ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి మన మండలాలు తీసుకున్నారు. అయిన సరే ఈ బీజేపీ బానిస ఎంపీలు పెదవులు తెరవరు. ఈ బీజేపీ బానిస ఎంపీలకు నేను సవాల్ చేస్తున్నా, మీరు తెలంగాణ బిడ్డలైతే భద్రాచలం వద్ద ఐదు గ్రామాలను తెలంగాణకు పట్టుకురండి. పోలవరం పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోతాయి. " అని సవాల్ చేసారు. 

Also Read: కవిత పార్టీ ప్రారంభించిన మొదటి రోజే బీఆర్‌ఎస్‌కు షాక్! ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది!

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget