Hyderabad: ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ల నిరసన, వారి డిమాండ్లు ఇవే
Hyderabad Osmania Medical College | హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Junior doctors protest at Osmania Medical College in Hyderabad | హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కళ్లకు బ్లాక్ క్లాత్ కట్టుకొని ఉస్మానియా మెడికల్ కాలేజీ (Osmania Medical College)లో జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపించకపోతే జూన్ 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. టైమ్ కు జీతాలు ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. జూడాల సమ్మెకు సంఘీభావంగా కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) కళ్లకు బ్లాక్ క్లాత్ కట్టుకుని నిరసన తెలిపారు. వరంగల్ లోనూ డాక్టర్లు నిరసన తెలుపుతూ.. ప్రతినెల క్రమం తప్పకుండా జీతాలు అందివ్వాలని డిమాండ్ చేశారు.
జూనియర్ డాక్టర్ల సమస్యలు, డిమాండ్స్ ఇలా ఉన్నాయి.
- ఉస్మానియా హాస్పిటల్‌కు నూతన భవనం నిర్మించాలని ఆరేళ్ల నుంచి కోరుతున్న అధికారులు, ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు
- టైమ్ కు జీతాలు ఇవ్వాలని కొన్ని నెలల నుంచి డిమాండ్ చేస్తున్నారు
- గత ఆరు నెలలుగా స్టైఫండ్ రావడం లేదని, వచ్చేలా చేయాలని జూడాలు డిమాండ్
- డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు
- ఉస్మానియా ఆసుపత్రిలో స్థలం లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
- రాష్ట్రంలో డాక్టర్లకు భద్రత లేకుండా పోయింది. తరుచూ ఏదో చోట వైద్యులపై దాడులు జరుగుతున్నాయి
- వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నారు కానీ అందుకు తగ్గట్లుగా హాస్టల్స్ పెంచి సౌకర్యాలు కల్పించడం లేదు. అయితే ప్రభుత్వం తక్షణమే స్పందించి డాక్టర్లు, జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.