IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్- సీన్‌లో 50 బృందాలు
ఈ మధ్య కాలంలోనే సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే తెలంగాణలో ఐటీ రైడ్స్ మొదలయ్యాయి.
![IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్- సీన్‌లో 50 బృందాలు IT raids in Telangana Minister Mallareddy's residence and offices IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్- సీన్‌లో 50 బృందాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/55418cbbbad6379fe118bbd640ba25ee1669084626154215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో మరో రాజకీయం సంచలనం. తెలతెలవారగానే మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 50 బృందాలు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన కుమారుడు, అల్లుడి ఇళ్లల్లో కూడా తనిఖీలు సాగుతున్నాయి. ఆయన కుమారుడు కొంపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ తెల్లవారు జాము నుంచే ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఈడీ సర్వైలెన్స్‌లో మంత్రి గంగుల కమలాకర్, టీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, నివాసాలపై ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి.
తెలంగాణలోని పొలిటకల్ లీడర్లు, వారితో సంబంధాలు ఉన్న వ్యాపారవేత్తలపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురు ఆఫీస్‌లు, కార్యాలయాల్లో ఈడీతో కలిసి సోదాలు చేసింది. ఇప్పుడు లేటెస్ట్‌గా మంత్రి మల్లారెడ్డిపై ఫోకస్ షిప్టు చేసింది ఆదాయపన్ను శాఖ.
తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి పై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి. మంత్రి మల్లారెడ్డి కూతురు, కుమారుడు, అల్లుడు నివాసాలతోపాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. 50 టీమ్స్ సహాయంతో ఐటీ అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నారు.
మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు సాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి. కాలేజీలు రియల్ ఎస్టేట్ రంగాల్లో మొత్తాన్ని కూడా డైరెక్టర్ గా ఉన్నారు మల్లారెడ్డి అల్లుడు, కుమారుడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)