అన్వేషించండి

Isro Chairman Somanath: మనం 300 ఏళ్లు జీవించొచ్చు, సినిమాలతో పోలిస్తే ఇస్రో ఖర్చు తక్కువ

JNTU Hyderabad Convocation: మనిషి జీవిత కాలంపై ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు పెనుమార్పులకు కారణమవుతాయన్నారు.

ISRO Chairman Somanath In JNTU Hyderabad: మనిషి జీవిత కాలంపై ఇస్రో ఛైర్మన్‌ (Isro Chairman) డాక్టర్‌ సోమనాథ్‌ (S Somanath) ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు మానవ జీవితంలో పెనుమార్పులకు కారణమవుతాయని వ్యాఖ్యానించారు.  జేఎన్‌టీయూ హైదరాబాద్‌ (JNTU Hyderabad)లో శుక్రవారం 12వ స్నాతకోత్సవం (Convocation) జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 54 మంది విద్యార్థులకు ఆయన బంగారు పతకాలను ప్రదానం చేశారు. గౌరవ డాక్టరేట్‌ స్వీకరించి మాట్లాడారు. భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవించే కాలం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనిషి 200, 300 ఏళ్లు జీవించే అవకాశం ఉంటుందని తెలిపారు. 

సినిమా ఖర్చుతో పోలిస్తే ఇస్రో ఖర్చు తక్కువ
స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనిషి సగటు జీవితకాలం 35 సంవత్సరాలు ఉండేదని, ప్రస్తుతం 70 ఏళ్లకు పెరిగిందనన్నారు. దేశంలో భారీ బడ్జె్ట్‌తో పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయని అన్నారు. వాటితో పోలిస్తే అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో చేస్తున్న పరిశోధనల ఖర్చు చాలా తక్కువ అన్నారు. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీలను గ్రహాల కక్ష్యల్లోకి పంపుతున్నామని, వీటి ద్వారా తుపాన్లు, భారీ వర్షాలు ఎప్పుడు, ఎక్కడ వస్తాయన్నది కచ్చితంగా తెలిసే అవకాశాలున్నాయని చెప్పారు. 

మీరు తయారు చేస్తే మేము ఉపయోగించుకుంటాం
అంతరిక్షంలోకి మనుషులను పంపే ‘మిషన్‌ గగన్‌యాన్‌’ను ఈ ఏడాదిలోపు పూర్తి చేస్తామని, సూర్యగ్రహంపై చేస్తున్న ప్రయోగం శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుందని వెల్లడించారు. విద్యార్థులు సరికొత్తగా ఆలోంచించాలని, బావిలో కప్పల్లా ఉండకూడదని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్‌ ప్రభావం ఇప్పటికే చదువులు, పరిశోధనలపై ఉందన్నారు. రోబోటిక్‌ పరిజ్ఞానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అత్యాధునిక రోబోలు సృష్టించాలని, వాటిని భవిష్యత్తులో ఇస్రో తరఫున అంగారక, శుక్రగ్రహాలపై చేయనున్న ప్రయోగాల్లో వినియోగించుకుంటామని తెలిపారు. 

విజయం ఓటమిని మరపిస్తుంది
సబ్జెక్ట్‌ ఫెయిలైతే పిల్లలపై తల్లిదండ్రులు, స్నేహితుల ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటున్నాయని సోమనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను కుడా ఒకటి, రెండు పరీక్షల్లో ఫెయిలయ్యానని చెప్పారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే అపజయాలు నిజంగా విజయానికి మెట్లేనని అన్నారు. విజయం వరించినప్పుడు ఓటమిని మర్చిపోతారని, ఇందుకు చంద్రయాన్ -3 ఒక ఉదాహరణ అన్నారు. చంద్రయాన్‌-3 విజయవంతమైప్పుడు విశ్వవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని, అది ముందు రెండుసార్లు ఫెయిల్‌ అయిన అంశాన్ని అందరూ మర్చిపోయేలా చేసిందని చెప్పారు. 

విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సు
విద్యార్థులు సైతం అపజయాలను విజయాలకు సోపానంగా మలుచుకోవాలని సూచించారు. రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేసేటప్పుడు తాము తప్పులు చేశామని, వాటిని నిజాయతీగా అంగీకరించి ఓటమికి కారణాలు అణ్వేశించాలని అన్నారు. అప్పుడే ఏం చేస్తే విజయం వరిస్తుందో తెలుస్తుందన్నారు. అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి ప్రదర్శించే విద్యార్థుల కోసం ‘యువిక’ పేరుతో సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.  కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, రెక్టార్‌ గోవర్ధన్‌, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఛాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ తమిళిసై వీడియో సందేశం పంపించారు. దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా జేఎన్‌టీయూ నిలిచిందని పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
Embed widget