అన్వేషించండి

Kalvakuntla Kavitha: ఏదో రోజు సీఎం అవుతాను.. మీ తోలుతీస్తా, కాళ్లు విరగ్గొడతా: కవిత సంచలన వ్యాఖ్యలు

ఏదో ఓ రోజు తాను సీఎం అవుతానని, అవకాశం వచ్చినప్పుడు తనపై బురద జల్లుతున్న వాళ్లకాళ్లు విరగ్గొడతానని, వాళ్ల తోలుతీస్తానంటూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: ఏదో ఓ రోజు తాను సీఎం అవుతానని, తనపై బురద జల్లుతున్న వాళ్లకాళ్లు విరగ్గొడతానని, వాళ్ల తోలుతీస్తానంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే తన భర్త పేరు ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు కొందరు ఉద్దేశపూర్వకంగా తనతో పాటు తన భర్త పేరు రాజకీయాల్లోకి లాగుతున్నారని కవిత మండిపడ్డారు. తాను ఢిల్లీలో పోరాటం చేస్తుంటే, బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కేసీఆర్ నీడలో ఏసీ రూముల్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

పార్టీ నుంచి వెళ్లగొట్టినా వేధింపులు ఆగవా..

దేవుడి దయవల్ల తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని.. అప్పుడు ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని, వాళ్ల కాళ్లు విరగ్గొడుతా, ఒక్కొక్కరి తోలు తీస్తానంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి నన్ను వెళ్లగొట్టారు, ఇంకా మీ కళ్లు చల్లబడలేదా, మాపై ఎందుకీ కక్ష అని ఆవేదన వ్యక్తం చేశారు.  2014లో బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని హెచ్చరించారు. తనకో అవకాశం వస్తుందని, వాళ్ల లెక్కలు అప్పుడు తేలుస్తా అన్నారు.


Kalvakuntla Kavitha: ఏదో రోజు సీఎం అవుతాను.. మీ తోలుతీస్తా, కాళ్లు విరగ్గొడతా: కవిత సంచలన వ్యాఖ్యలు

అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని తప్పుపట్టారు. బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని, అందుకే బీఆర్ఎస్ నేతల అవినీతిని ఇంకా బయటపెట్టలేదని, అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారని తనను టార్గెట్ చేసిన వారిని ఉద్దేశించి కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

నేను గాంధీ, కేసీఆర్ లాగ కాదు..

సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒక్కటి ఒకటి, చేసేది మరొకటి. ఒకవేళ తాను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతానని, అయితే నేను తప్పు చేయనని స్పష్టం చేశారు. నేను బీఆర్ఎస్‌లాగ ఎవరినీ టార్గెట్ చేయను. నేను జాతిపిత మహాత్మా గాంధీ లాగానో లేదా కేసీఆర్ లాగా అంత మంచిదాన్ని కాదు. నన్ను ఎవరైనా ఒకటి కొడితే రెండు దెబ్బలు తిరిగి కొట్టే రకాన్ని.  బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో జరిగిన తప్పిదాలకు, నాకు ఎలాంటి సంబంధం లేదని’ కవిత అన్నారు. 


Kalvakuntla Kavitha: ఏదో రోజు సీఎం అవుతాను.. మీ తోలుతీస్తా, కాళ్లు విరగ్గొడతా: కవిత సంచలన వ్యాఖ్యలు

ఆరోపణలు చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్, లీగల్ నోటీసులు
తనపై ఆరోపణలు చేస్తున్న వారికి మాజీ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపినట్లు కవిత తెలిపారు. తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, అందుకుగానూ వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారికి పంపిన నోటీసులలో కవిత డిమాండ్ చేశారు. 

"దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు జవాబు చెప్పండి. అంతేకానీ, నేను చేసిన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు నాపై, నా భర్త గురించి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వం నుంచి మాకు ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీరు చేసిన అక్రమాలను తనపై రుద్దొద్దు.  ఎవరితోనూ తనకు ఎలాంటి అండర్‌స్టాండింగ్ లేదు" అని కవిత పేర్కొన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు- నిందితుడు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తుది తీర్పు
నటి ప్రత్యూష మృతి కేసు- నిందితుడు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు
Telangana CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత
సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత
Telangana Municipal Polls: హీటెక్కిన మున్సిపల్ పోరు.. ఇబ్రహీంపట్నంలో కిడ్నాప్ ఆరోపణలు! తొర్రూరులో ఎర్రబెల్లికి చేదు అనుభవం!
మున్సిపల్ పోరు.. ఇబ్రహీంపట్నంలో కిడ్నాప్ ఆరోపణలు! తొర్రూరులో ఎర్రబెల్లికి చేదు అనుభవం!
Municipal Chairman, Mayor Elections: ఏ ఒక్కటీ చేజారవద్దు, అన్నీ హస్తగతం కావాలి: పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
ఏ ఒక్కటీ చేజారవద్దు, అన్నీ హస్తగతం కావాలి: పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Advertisement

వీడియోలు

Australia Eliminated T20 World Cup 2026 | వర్షం కారణంగా Ireland vs Zimbabwe మ్యాచ్ రద్దు | ABP Desam
Mohammad Yousuf Slams Political Interference | పాక్ ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Epic 'No-Look' Wicket | వైరల్ అవుతున్న హార్దిక్ 'నో-లుక్' వికెట్
Vaibhav Suryavanshi Skips 10th Board Exams | వైభవ్ సూర్యవంశీ షాకింగ్ నిర్ణయం
Australia vs Sri Lanka T20 World Cup 2026 | అద్భుతమైన విజయంతో సూపర్ -8లోకి శ్రీలంక
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BioAsia Conference: జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Bangladesh new govt: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
IAS Sri Lakshmi: జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
Rahul Gandhi: నాయకత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడు -తీవ్రంగా విరుచుకుపడ్డ సిద్దూ భార్య
నాయకత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడు -తీవ్రంగా విరుచుకుపడ్డ సిద్దూ భార్య
AI Summit 2026: డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?
డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?
Allu Arjun Controversy: సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ
సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ
Bengaluru: ఆస్తి రాసివ్వడం లేదని తండ్రిని కొట్టి చంపేసిన కొడుకులు - ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు !
ఆస్తి రాసివ్వడం లేదని తండ్రిని కొట్టి చంపేసిన కొడుకులు - ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు !
AP Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని సభ్యులపై త్వరలో నిర్ణయం.. రీకాల్ విధానంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీకి రాని సభ్యులపై త్వరలో నిర్ణయం.. రీకాల్ విధానంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Embed widget