అన్వేషించండి

HYDRA News: హైడ్రా దెబ్బ! బోరుమన్న బాధితులు, ఐదంతస్తుల బిల్డింగ్ కళ్లముందే నేల మట్టం

బోరబండలో హైడ్రా కూల్చివేతలు ఉద్రిక్తంగా మారాయి. కూల్చివేతలు ఆపాలంటూ ఆత్మహత్యాయత్నం చేయబోయారు స్దానికులు.ఇదేం అన్యాయం, నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తారా అంటూ బోరున విలపించారు బాధితులు..

Hyderabad News: బోరబండ సున్నం చెరువు.. ఒకప్పుడు 26 ఎకరాలు.. ఇప్పుడు 5 ఎకరాలు. దీనిపై హైడ్రా కన్ను పడింది. ఆక్రమణలే లక్ష్యంగా అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా తాజాగా ఇక్కడ కూడా ప్రతాపం చూపింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన తర్వాత రోజే కూల్చివేతలు మొదలయ్యాయి.

హైడ్రా దూకుడు బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతోంది. చెరువులు ఆక్రమణ జరిగింది అని భావిస్తే.. ఈరోజు చూడాలి.. రేపు కూల్చేయాలి. ఇదీ ప్రస్తుతం హైడ్రా లెక్క. ఈరోజు బోరబండలోని సున్నం చెరువును ఆక్రమించి ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించిన భారీ భవనంతోపాటు, రేకుల షెడ్డులను కూల్చేశారు. అయితే కూల్చివేత సమయంలో సున్నం చెరువు వద్ద హైడ్రామా నెలకొంది. తాము కొనుగోలు చేసిన తరువాత మాత్రమే భవనం నిర్మించామని, ఎందుకు కూల్చేస్తున్నారంటూ బాధితులు బోరున విలపించారు. హైడ్రా బుల్డోజర్ ను అడ్డుకునే ప్రయత్నం చేసారు. వివరాల్లోకి వెళితే..

బోరబండలోని సున్నం చెరువు 26 ఎకరాల విస్తీర్ణంలో సర్వే నెంబర్ 12,13,14,16 లో విస్తరించి ఉంది. ఇందులో ఎఫ్ ఎల్ పరిధిలో పదిహేను ఇకరాల ఇరవై గుంటలు ఉంది. మిగతా 11 ఎకరాలు బఫర్ జోన్ పరిధిలో ఉంది. నిబంధనల ప్రకారం 26 ఏకరాల చెరువు విస్తీర్ణంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా అవి చట్టవిరుద్దం. ఏ సమయంలోనైనా కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయం తెలిసినా కొందరు చెరువును ఇష్టానుసారం ఆక్రమించేశారు. ఎంతలా అంటే ప్రస్తుతం సున్నపు చెరువు విస్తీర్ణం పట్టుమని ఆరు ఎకరాలు కూడా లేని పరిస్దితి. ఇరవై ఎకరాల చెరువు స్థలం కబ్జాజరిగిందనే ఆరోపణల నేపథ్యంలో హైడ్రా యాక్షన్ మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలో బోరబండలోని సున్నపు చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్ ఫోర్ భవనం కూల్చివేత సమయంలో ఉద్రిక్తత నెలకొంది. భవనం యజమానులు నాగేందర్, రాధా ఇద్దరు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా భవనం నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయి. స్థలం కూడా కొనుగోలు చేసిన తరువాతనే భవనం నిర్మించాము అంటూ బోరున విలపించారు. నాగేందర్ బుల్డోజర్ లకు అడ్డుగా వెళ్లడంతో బలవంతంగా చేతులపై ఎత్తుకుంటూ కూల్చివేత ప్రాంతం నుంచి పంపించివేశారు పోలీసులు. రాధ ఒక్కసారిగా ఏడుస్తూ ఇదేం అన్యాయం అంటూ లబోదిబో మంటూ హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్వే చేయలేదు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. మేము ఇప్పటికే కోర్టుకు వెళ్లాం.. అక్రమం అయితే కూల్చేయొచ్చు. కానీ ఇలా దారుణంగా, దౌర్జన్యంగా కూల్చేస్తారా అంటూ హైడ్రా తీరుపై మండిపడ్డారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన రాధను సైతం బలవంతంగా అక్కడినుండి పంపించివేశారు పోలీసులు.

ఇలా జరిగిన కొద్దిక్షణాల్లో అక్కడే ఉన్న రేకులు షెడ్లలో నివసించే జనం ఒక్కసారిగా రోడ్డెక్కారు. మా ఇళ్లు కూల్చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. అయినా పోలీసులు వారిని చెదరగొట్టారు.

రోడ్డెక్కిన జనం.. కిరోసిన్ పోసుకొని..

ఇలా జరిగిన కొద్దిక్షణాల్లో అక్కడే ఉన్న రేకుల షెడ్లలో నివసించే జనం ఒక్కసారిగా రోడ్డెక్కారు. మా ఇళ్లు కూల్చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుంటున్నాం చూడండి అంటూ హల్ చల్ చేశారు. కూల్చిేవేతలు ఆపాలంటూ ఒంటికి నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసారు.దీంతో బోరబండ సున్నపు చెరువు కూల్చివేతలు ఉద్రిక్తంగా మారాయి.సున్నపు చెరువు చుట్టుప్రక్కల అక్రమ కట్టడాలను ఎట్టిపరిస్దితుల్లోనూ కూల్చేస్తామంటూ హైడ్రా చెబుతోంది. ఓవైపు బాధితుల ఆందోళనలు కొనసాగుతుంటే మరోవైపు హైడ్రా తనపని తాను చేసుకుంటూ పోతోంది.

స్దానికులు  ఏమంటున్నారంటే..

HYDRA News: హైడ్రా దెబ్బ! బోరుమన్న బాధితులు, ఐదంతస్తుల బిల్డింగ్ కళ్లముందే నేల మట్టం
HYDRA News: హైడ్రా దెబ్బ! బోరుమన్న బాధితులు, ఐదంతస్తుల బిల్డింగ్ కళ్లముందే నేల మట్టం

‘‘ఇదే సున్నపు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అనేక విల్లాలు నిర్మించారు. కానీ వాటిని మాత్రం హైడ్రా పట్టించుకోలేదు. మా పేదల ఇళ్లను మాత్రమే కూల్చేయడం న్యాయం కాదు. హైడ్రా పేరుతో పేదలపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇది సొసైటీ భూమి, అక్రమంగా మేం ఇళ్లు కట్టుకోలేదు. మాకు కనీససం సమయం ఇవ్వలేదు. నెలకు మూడువేలు కిరాయికట్టి ఉంటున్నాం. ఇప్పడు ఇక్కడికెళ్లి బ్రతకాలి. భార్యా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి పోవాలి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కూల్చేస్తారని తెలిసి ఎవరూ ఇళ్లు కొనరు. ముందు ఎందుకు అనుమతులు ఇచ్చారు. ఇప్పడు ఇలా దారుణం ఎందుకు కూల్చేస్తున్నారు. మా ఇళ్లు బఫర్ జోన్ లో లేవంటూ మొదట చెప్పారు. ఒక్కసారిగా కూల్చేయండి అంటూ ఆదేశాలిచ్చారు. లోన్ తీసుకుని ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు మా పరిస్దితి ఏంటి, ఇలా చేయడం దారుణం’’ అని బాధితులు వాపోయారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Embed widget