Priyanka Sanduri : మిసెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ప్రియాంక సందూరి
Priyanka Sanduri : హైదరాబాద్‌కు చెందిన మహిళ మిసెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. ఉదయపూర్‌లో జరిగిన పోటీల్లో ప్రియాంక విజేతగా నిలిచారు.

Priyanka Sanduri : ఉదయపూర్‌లో ఈ మధ్య జరిగిన మిసెస్ ఇండియా డివా సీజన్ -6 గ్రాండ్ ఫినాలేలో హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక సందూరి విజేతగా నిలిచారు. ఈమె ఓల్డో బోయిన్‌పల్లికి చెందిన మహిళ. డివా బ్యూటీ పేజెంట్ ఆధ్వర్యంలో ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన పోటీల్లో వందల మంది మహిళలు పాల్గొన్నారు. వారికి అనేక పోటీలు పెట్టి చివరకు గ్రాండ్ ఫినాలేకు 32మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీళ్లకి మళ్లీ చాలా కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫ్యాషన్ షో, టాలెంట్ రౌండ్, నేషనల్ కాస్ట్యూమ్స్, ఇంటర్వ్యూస్ రౌండ్ ఇలా అన్ని విధాలుగా వారి టాలెంట్‌ను పరీక్షించి విజేతను ఎంపిక చేశారు. వారిలో ప్రియాంక తన టాలెంట్ చూపించి న్యాయనిర్ణేతలను మెప్పించారు.

అమ్మవారి వేషధారణలో ప్రియాంక చేసిన నృత్యం పలువురిని కట్టిపడేసింది. ప్రజెంట్ మహిళలపై జరుగుతున్న దాడులు, ఇతర హింసాత్మక ఘటనలను ఇతివృత్తంగా తీసుకొని ఈ డాన్స్ స్కిట్‌ను ఆమె డిజైన్ చేసుకున్నారు. ఆమె విజేతగా నిలవడంతో ఈ స్కిట్ చాలా ఉపయోగపడిందని చెబుతున్నారు.

మిసెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తొలి దక్షిణాది మహిళగా ప్రియాంక నిలిచారు. ఈ విజయం తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆమెకు గ్రాండ్ వెల్క్‌మ్ లభించింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఆమెను కంగ్రాట్యులేట్ చేశారు. లండన్‌లో స్థిరపడ్డ ఆమె తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇస్తామని చెప్పారు. ఇలాంటి గెలుచుకున్న ఏకైక తెలంగాణ మహిళ కావడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.





















