By: ABP Desam | Updated at : 28 Nov 2022 11:43 AM (IST)
Edited By: jyothi
హైదరాబాద్ వాహనదారులకు షాక్, నేటి నుంచి మరింత కఠినంగా ట్రాఫిక్ రూల్స్!
Hyderabad Traffic Rules: హైదరాబాద్ వాహన దారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ ను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈరోజు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే.. భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే పెద్దమొత్తంలో జరిమానాలు విధించనున్నారు. ఈ మధ్య కాలంలో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేయగా.. ఈ రెండు ఉల్లంఘనల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఉల్లంఘనకు పాల్పడుతున్న వాహనదారులతోపాటు పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడి అయింది. ఈ క్రమంలోనే వాహనదారులతోపాటు, పాదచారులకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు.
రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు 1700 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్ కు 1200 రూపాయల వరకు ఫైన్ విధించనున్నారు. ఇక జీబ్రా లైన్ దాటితే 100 రూపాయల ఫైన్, ఫ్రీ లెఫ్ట్ కు అడ్డుపడితే 1000 రూపాయల జరిమానా విధించనున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ప్రమాదాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. వాటిపై విఘించే జరిమానాలు కూడా తక్కువగానే ఉంటాయని అధికారులు చెప్పారు. భారీ వాహనాలు రాంగ్ రూట్ లో రావడంతో నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బైక్ లు, ఆటోలకు విధించే జిరిమానాలతో పోలిస్తే.. భారీ వాహనాలకు విధించే జరిమానాలు ఎక్కువేనని చెప్పారు. మధ్య తరగతి ప్రజలు నడిపించే వాహనాల బైక్ లు, ఆటోలపై విధించే జరిమానాలు గతంలో పోలిస్తే తక్కువగానే ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు తగ్గించాలని కోరుతున్నారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) November 19, 2022
Press Note issued in connection with Education & Special Drive against the "WRONG SIDE DRIVE & TRIPLE RIDING". @JtCPTrfHyd pic.twitter.com/zdz3lVsWjx
ఇటీవల ఆపరేషన్ రోప్ చేపట్టిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహన దారులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహనా పెంచుతున్నారు. తాజాగా రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. జరిమానాల (Traffic Rules In Hyderabad)ను పెంచుతూ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ.1700 జరిమానా విధిస్తారు. ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200 జరిమానా చెల్లించక తప్పదని ట్రాఫిక్ పోలీసులు తాజాగా ట్వీట్టర్ లో వెల్లడించారు.
ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 15 మంది చనిపోగా, ట్రిపుల్ రైడింగ్ ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలను, మరణాలను పూర్తిగా తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సర్కిల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 ఫైన్, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా, పాదచారులకు అడ్డుగా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా విధిస్తున్నారు. అయితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ రోప్’ విజయవంతం కావడం, ప్రమాదాలను నివారించేందుకుగానూ ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా- హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు!
Hyderabad: ఒకరోజులో 20 ఇళ్లలో దొంగతనాలు! అవాక్కైన పోలీసులు - ఎట్టకేలకు అరెస్టు
Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు
Hyderabad Fire Accident: చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, సమీప బస్తీల్లో జనం భయాందోళన
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు