By: ABP Desam | Updated at : 06 Dec 2022 10:22 PM (IST)
హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic News: హైదరాబాద్ నగరంలో మరోసారి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించనున్న కారణంగా 09-12-2022 నుంచి 11-12-2022 వరకు క్రింది ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. రేసు IMAX (నెక్లెస్ రోడ్) రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్ మీదుగా కొత్త సెక్రటేరియట్ , NTR గార్డెన్ నుంచి మింట్ కాంపౌండ్ వరకు జరగనున్నందున డిసెంబర్ 9వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని, వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్ రేసింగ్ పోటీలు జరగనున్నందున కొద్ది రోజుల పాటు కొన్ని సందర్శనీయ ప్రదేశాలు మూసివేయనున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ మూడు రోజులపాటు మూసివేయనున్నారు. కొన్ని రోజుల కిందట హుస్సేన్ సాగర్ తీరంపైన రోడ్డులో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహణ సమయంలోనూ ట్రాఫిక్ ను మళ్లించారు.
డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- వీవీ స్టాట్యూ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు అనుమతించరు. వీవీ స్టాట్యూ నుంచి షాదాన్ కాలేజీ వైపుగా రవీంద్రభారతికి ట్రాఫిక్ మళ్లింపులు
- బుద్దభవన్ వైపు, నల్లగుట్ట జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్ వైపు, ఐమాక్స్ రోటరీ వైపు నో ఎంట్రీ. అటునుంచి నల్లగుట్ట జంక్షన్ మీదుగా రాణిగంజ్/ ట్యాంక్ బండ్ మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు.
- రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నెక్లెస్ రోటరీ సైడ్ అనుమతించరు. ఆ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ తెలుగు తల్లి వైపు అనుమతించరు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కట్ట మైసమ్మ దేవాలయం/లోయర్ ట్యాంక్ బండ్ వైపు ట్రాఫిక్ మళ్లింపులు. లేకపోతే ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి వద్ద కుడివైపు తీసుకొని పబ్లిక్ గార్డెన్స్ జంక్షన్ - బషీరాబాగ్ - లిబర్టీ వైపు వెళ్లి BRK భవన్ లేదా ట్యాంక్ బండ్ వైపు వెళ్లవచ్చు.
- ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. అటునుంచి ఇక్బాల్ మినార్ రవీంద్ర భారతి జంక్షన్ వైపు వాహనాల మళ్లింపులు
- బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ వద్ద నుంచి ఇక్బాల్ మినార్/ రవీంద్ర భారతి జంక్షన్ వైపు డైవర్షన్..
- ఖైరతాబాద్ పెద్ద గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వైపు, నెక్లెస్ రోటరీ వైపు అనుమతి లేదు. బడా గణేష్ వద్ద నుంచి రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లిస్తారు
- ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు ఫార్మూలా ఈ రేసింగ్ నిర్వహణ కారణంగా మూసివేయనున్నారు.
- ఒకవేళ రేస్ నిర్వహణకు అవసరమైతే డిసెంబర్ 7, 8 తేదీల్లోనూ రాత్రివేళల్లో కొన్ని మార్గాలను మూసివేసే అవకాశం ఉంది.
ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!
Love Marriage : ఖండాలు దాటిన ప్రేమ, ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి
Himanshu Heads CAsnival : ఈ కాస్నివాల్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి, ఈవెంట్ డబ్బులతో నానక్ రామ్ గూడ చెరువు పునరుద్ధరణ- హిమాన్షు
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
BJYM Protest : డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బీజేవైఎం అధ్యక్షుడికి గాయాలు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!