అన్వేషించండి

Rowdy Sheeter Murder: హోమో సెక్స్ ట్రాప్ వేసి, పక్కా ప్లాన్ ప్రకారం రౌడీషీటర్ మర్డర్: పోలీసులు వెల్లడి

Rowdy Sheeter Murder: బండ్లగూడలో జరిగిన రౌడీషీటర్ దారుణ హత్యను పోలీసులు ఛేదించారు. ఆరు రోజుల క్రితం ఓల్డ్‌సిటీలోని బార్కాస్ కు చెందిన షేక్ సయీద్ బావజీర్ హత్యకు గురయ్యాడు.

Rowdy Sheeter Murder: బండ్లగూడలో జరిగిన రౌడీషీటర్ దారుణ హత్యను పోలీసులు ఛేదించారు. ఆరు రోజుల క్రితం ఓల్డ్‌సిటీలోని బార్కాస్ కు చెందిన షేక్ సయీద్ బావజీర్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో జల్ పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ బిన్ అహ్మద్ సాదీ, మరో ఇద్దరు రౌడీ షీటర్ల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

బండ్లగూడలో బావాజీర్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భవానీ నగర్‌కు చెందిన రౌడీషీటర్ అహ్మద్ బిన్ హజబ్‌తో ఫ్రెండ్‌షిప్ ఉంది.  ఇటీవల తనకు ప్రాణ‌హాని ఉందని బావాజీర్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత పోలీసులు పట్టించుకోవడం లేదని, తనను కాపాడాలంటూ హోంమంత్రిని కలిసి వేడుకున్నాడు. ఈ క్రమంలో గత వారం హత్యకు గురయ్యాడు. 

దీనిపై  విచారణ చేపట్టిన పోలీసులు బావజీర్ హత్యకు జల్‌పల్లి మున్సిపల్ చైర్మన్, అతడి కుటుంబ సభ్యులు కారణమని గుర్తించారు. కొద్ది సంవత్సరాలుగా బావజీర్ సోషల్ మీడియా, తన యూట్యూబ్ ఛానళ్లలో అబ్దుల్ బిన్ అహ్మద్ సాదీ అవినీతిపై ప్రచారం చేసేవాడు. ఈ నేపథ్యంలో తనపై వచ్చే వార్తలను అడ్డుకునేందుకు బావాజీర్‌కు అబ్దుల్ బిన్ అహ్మద్ సాదీ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారు. అయితే కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న బావజీర్ మళ్లీ తన పనిని మొదలు పెట్టారు. అబ్దుల్ బిన్ అహ్మద్ సాదీపై సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారం చేసేవాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసే వాడు. ఈ వేధింపులు తాళలేక మున్సిపల్ చైర్మన్ రౌడీషీటర్ బావజీర్‌ను హతమార్చాలని ప్లాన్ వేశారు.

పక్కాగా పథకం 
బావాజీర్‌కు అతని స్నేహితుడైన అహ్మద్ బిన్ హజబ్‌‌తో స్వలింగ సంపర్కం ఉందని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ బిన్ అహ్మద్ సాదీ, అతని కుటుంబ సభ్యులు బవాజీర్‌ను హతమార్చేందుకు పథకం పన్నారు. అహ్మద్ బిన్ హజబ్‌ ద్వారాహత్య చేయిస్తే హోమ్ సెక్సువల్ గొడవలు వల్ల హత్య చేసినట్లు అవుతుందని భావించి ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10న రాత్రి బెవాజీర్‌పై అహ్మద్ బిన్ హజబ్‌ కత్తితో దాడి చేయడంతో బెవాజీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో అహ్మద్ సాదీ రౌడీషీటర్, మూడవ నిందితుడిగా జల్‌పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ బిన్ అహ్మద్ సాదీ ఉన్నారు.

బవాజీర్‌పై పలు కేసులు
హైద‌రాబాద్ పాతబస్తీలో హత్యకు గురైన రౌడీ షీట‌ర్ షేక్ సయీద్ బవాజీర్‌పై అనేక కేసులు ఉన్నాయి. హత్యాయత్నం, పోక్సో కేసు, దాడి కేసుల్లో ప్రమేయం ఉంది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద గ‌తంలో పోలీసులు అరెస్టు చేశారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ వీడియోలు బవాజీర్ పోస్ట్ చేసేవాడు. ఓ రాజకీయ పార్టీతో సంత్సంబంధాలు కొన‌సాగించేవాడు, కొద్ది కాలానికి  ఆ పార్టీని వ‌దిలేశాడు. బండ్లగూడలో బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రారంభించాడు.

ఇటీవల సోషల్ మీడియాలో బవాజీర్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీ గురువారం రాత్రి అతను దుకాణంలో ఉన్నప్పుడు, అతని స్నేహితుడు, ఒక రౌడీషీటర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు వ‌చ్చి క‌త్తితో పొడిచి చంపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget