Patancheru MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు హఠాన్మరణం, సొమ్మసిల్లిపడిపోయిన తండ్రి
Vishnu Vardhan Reddy Death: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
Vishnu Vardhan Reddy Death: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారు 30 ఏళ్ల విష్ణు వర్ధన్ రెడ్డి గుండెపోటుకు గురై ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలోనే గురువారం రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురై చనిపోయారు. కిడ్నీలు పాడవడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే వైద్యులు విష్ణు వర్ధన్ రెడ్డికి డయాలసిస్ చేశారు. గత కొద్ది కాలంగా ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఈక్రమంలోనే తెల్లవారుజామున గుండెపోటు రాగా ప్రాణాలు కోల్పోయారు. విష్ణు వర్ధన్ మృతదేహాన్ని ఈరోజు ఉదయం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసానికి తీసుకు వచ్చారు. కుమారుడి మృతదేహం చూసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు.
రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో పటాన్ చేరు ఎమ్మేల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గుడెం విష్ణువర్ధన్ రెడ్డి మృతి. pic.twitter.com/ott0ucESmE
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2023
కొడుకు మృతదేహం చూసి సొమ్మసిల్లి పడిపోయిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. pic.twitter.com/wZSNtHbsNB
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2023