By: ABP Desam | Updated at : 22 Sep 2023 11:14 AM (IST)
Edited By: jyothi
వైఎస్ సహాయకుడు సూరీడుపై హైదరాబాద్‌లో కేసు - పోలీసులపై కూడా అభియోగాలు
Hyderabad News: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు అయిన ఎర్రంరెడ్డి సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరీడుతోపాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గతంలో తనపై దాడిచేసి, ఇబ్బంది పెట్టిన సూరీడు, ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరీడి అల్లుడు సురేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లుడి సురేందర్ రెడ్డిపై మామ సూరీడు దాడి
సూరీడి కుమార్తెను కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్ రెడ్డితో గతంలో పెళ్లి జరిగింది. తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సూరీడి కుమార్తె తన భర్తపై వరకట్న వేధింపుల కింద కేసు పెట్టారు. 2021 మార్చి 23న రాత్రి 7.30కు సురేందర్ రెడ్డి క్రికెట్ ఆడిన తర్వాత కుమార్తెను చూడడానికి జూబ్లీహిల్స్ లోని తన మామ ఇంటికి వెళ్లారు. అక్కడ సూరీడు, సురేందర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అల్లుడు సురేందర్ రెడ్డిపై మామ సూరీడు దాడి చేశారు.
సురేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అదే సమయంలో జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ క్రమంలో సురేందర్ రెడ్డి చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ ను తీసుకుని సురేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సురేందర్ రెడ్డిని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ సమయంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ గా పని చేసిన రాజశేఖర్ రెడ్డి, ఎస్సై నరేష్ .. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఐజీగా పని చేస్తున్న జి.పాలరాజుతో కలిసి తనను అక్రమంగా నిర్బంధించి, దాడికి పాల్పడ్డారని సురేందర్ రెడ్డి ఆరోపణలు చేశారు.
సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు సహా మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్
తనను అక్రమంగా కస్టడీలోకి తీసుకొని, తనపై తప్పుడు కేసులు పెట్టిన సూర్య నారాయణ రెడ్డి అలియాస్ సూరీడు, అప్పటి ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై నరేష్, ప్రస్తుతం ఏపీ ఐజీ పాలరాజులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మంగళవారం సురేందర్ రెడ్డి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి.. సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుబ్బయ్య నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ పాలరాజుపై సురేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
Read Also: మీసాలు తిప్పి విజిల్ వేస్తూ ఆందోళన- అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య హంగామా
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
/body>