News
News
వీడియోలు ఆటలు
X

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మార్గంలో ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతుంది.

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ క్రికెట్‌ స్టేడియంలో నేడు జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం వచ్చే ప్రేక్షకుల కోసం ఆర్టీసీతోపాటు, మెట్రో ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.  హైదరాబాద్‌, రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే టికెట్లన్నీ బుక్‌ అయిపోగా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ, మెట్రో సంస్థలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించాయి.

హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మార్గంలో ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతుంది. అదేవిధంగా నాగోల్‌ - అమీర్‌పేట మెట్రో మార్గంలో కూడా అదనంగా రైళ్లు నడుపుతామని ఆ సంస్థ ప్రకటించింది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో సంస్థ ప్రకటించింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఆర్టీసీతోపాటు మెట్రో కూడా మరిన్ని సర్వీసులను నడుపుతామని ప్రకటించాయి.

60 వరకూ ప్రత్యేక బస్సులు

నేటి నుంచి మ్యాచ్ జరిగే రోజులు 2, 9, 18 తేదీలతో పాటు.. మే నెల 4, 13, 18 తేదీల్లో ఉప్పల్‌లో మ్యాచ్‌ చూసేందుకు వచ్చే వారికి హైదరాబాద్ లోని అన్ని డిపోల నుంచి 60 వరకూ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఓ ప్రకటనలో శనివారం తెలిపింది. మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 8.30 వరకూ ఈ బస్సులు తిరుగుతాయని, క్రికెట్‌ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

మెట్రో సేవల సమయం కూడా పెంపు..

క్రికెట్‌ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని మెట్రోరైళ్లను రాత్రి 1 గంట వరకు నడపనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను చూసేందుకు మధ్యాహ్నం నుంచే ప్రేక్షకులు స్టేడియం చేరుకునే అవకాశం ఉంది. అందుకే మధ్యాహ్నం 12.30 నుంచే రైళ్లు ఫ్రీక్వెన్సీని పెంచుతున్నామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో

ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ చేశారు. ఉప్పల్‌ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత సికింద్రాబాద్‌, హబ్సిగూడ, తార్నాక, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, అంబర్‌పేట, రామంతపూర్‌, ఎన్‌ఎస్‌ఎల్‌ ఎరీనా, ఎల్బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌ ఎక్స్‌రోడ్, కేవీ-1 స్కూల్‌, వరంగల్‌ హైవే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.

మధ్యాహ్నం 3 గంటల తరువాత మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 4-వీలర్లు, 2-వీలర్లను కలిపి పార్కింగ్ చేయడానికి మొత్తం 18 పార్కింగ్ స్థానాలు అందుబాటులో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్, హబ్సిగూడ, తార్నాక నుంచి వచ్చే క్రికెట్ అభిమానులు  తమ వాహనాలను IALA పార్కింగ్, పెంగ్విన్ టెక్స్‌టైల్ పార్కింగ్, 4 NGRI గేట్ నంబర్ 1 నుంచి 3, జెన్‌పాక్ట్ లేన్, జెన్‌పాక్ట్ నుంచి NGRI మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేసారు.

నేటి నుండి  మే 18 వరకు మొత్తం 215 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని పార్కింగ్ స్థలాలు, సాధారణ ట్రాఫిక్ కోసం ప్రధాన మార్గాలు, స్టేడియంకు వెళ్లే మార్గాలతోపాటు స్డేడియం చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసే 8 సెక్టార్లలో పోలీసులు మోహరించారు. మ్యాచ్ కు వచ్చే క్రికెట్ అభిమానులు ఏక్ మినార్ మస్జిద్ రోడ్, స్టేడియం రోడ్ , హిందూ ఆఫీస్ రోడ్ నుండి స్టేడియంకు యాక్సెస్ రోడ్లలోకి చేరుకోవచ్చు. పార్కింగ్ స్థలాలు, వేదిక మార్గాల్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా వాహనదారులకు కోసం 324 అనేక సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

Published at : 02 Apr 2023 12:10 PM (IST) Tags: Hyderabad TSRTC Buses Hyderabad Metro Uppal Stadium IPL Match

సంబంధిత కథనాలు

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Saroornagar News: అప్సరకు అబార్షన్, పోలీసులతో నిందితుడు సాయిక్రిష్ణ, తల్లి వాదన మరోలా!

Saroornagar News: అప్సరకు అబార్షన్, పోలీసులతో నిందితుడు సాయిక్రిష్ణ, తల్లి వాదన మరోలా!

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి